YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

విదేశీయం

అమెరికాలో మరోసారి కాల్పుల మోత..

అమెరికాలో మరోసారి కాల్పుల మోత..

- ఫ్లోరిడాలో కాల్పులు.. 17మంది మృతి

- మరో 14 మందికి గాయాలు 

-  ట్రంప్ తీవ్ర దిగ్భ్రాంతి

అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. ఫ్లోరిడా పార్క్‌ల్యాండ్‌లోని మర్జోరీ స్టోన్‌మన్‌ డగ్లస్‌ పాఠశాలలో ఓ యువకుడు విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో 17 మంది విద్యార్థులు మృతిచెందారు. మరో 14 మంది గాయపడ్డారు. నిందితుడిని అదే స్కూల్‌కు చెందిన పూర్వ విద్యార్థి నికోలస్‌ క్రూజ్‌ (19)గా పోలీసులు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకున్నారు. కాల్పుల్లో గాయపడిన వారిని ఆస్ప్రతికి తరలించారు. వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎక్క‌డిక‌క్క‌డ ర‌క్తధార‌ల‌తో పాఠ‌శాల‌ ఆవరణ అంతా భీకరంగా  మారింది. కాల్పుల నుంచి త‌ప్పించుకునేందుకు అక్కడివారు భయంతో న‌లుదిక్కుల‌కూ పరుగులు తీశారు.

కోపంతోనే.. 
ఈ స్కూల్లోనే చ‌దువుతున్న నికోల‌స్‌ను కొద్దిరోజుల క్రితం యాజ‌మాన్యం స‌స్సెండ్ చేసిన‌ట్లు తెలుస్తోంది. త‌న‌ను సస్పెండ్‌ చేశారన్న కోపంతోనే నిందితుడు ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు సమాచారం.   పాఠశాలలోకి ప్రవేశించిన వెంటనే విచ‌క్ష‌ణా ర‌హితంగా కాల్పులకు తెగబడిన దుండగుడు.. అడ్డ‌కోవ‌డానికి ప్ర‌య‌త్నించిన ముగ్గురిని  కాల్చేశాడు. అనంతరం పాఠశాలలోని ఫైర్ అలారం మోగించాడు. దీంతో ఏదో జ‌రిగింద‌న్న ఆందోళ‌న‌తో అంద‌రూ ప్రవేశ ద్వారం వైపు పరిగెత్తుకుంటూ వచ్చారు. అక్కడే కాచుకుని ఉన్న నికోల‌స్‌.. వారిపై విచ‌క్షణా ర‌హితంగా కాల్చేశాడు.  కాల్పుల సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన‌ సంఘటనా స్థలానికి చేరుకోవడంతో దుండగుడు పాఠశాల భవనంలో దాక్కున్నాడు. అనంతరం పోలీసులపై కాల్పులకు తెగబడ్డాడు. దీంతో పోలీసులు కూడా దుండగుడిపై ఎదురు కాల్పులకు దిగారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్నారు.

ట్రంప్ దిగ్భ్రాంతి 
ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతిచెందిన విద్యార్థుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

Related Posts