YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

విదేశీయం

ఉగ్రవాద దాడుల్లో  605 మంది ఆహుతి

Highlights

  • 2017లో 17 శాతం పెరిగిన మృతుల సంఖ్య.. 
  • మృతుల సంఖ్య గతం కంటే 9 శాతం తగ్గింది
  • అఫ్ఘానిస్థాన్‌లో జరిగిన ఉగ్రదాడులపై ఐరాస నివేదిక
ఉగ్రవాద దాడుల్లో  605 మంది ఆహుతి

 ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం..  అఫ్ఘానిస్థాన్‌లో 2017వ సంవత్సరంలో జరిగిన ఆత్మాహుతి దాడుల్లో 2,300 మంది పౌరులు బాధితులయ్యారని, అందులో 605 మంది చనిపోగా, 1690 మంది గాయాలకు గురైయ్యారు. . ఉగ్రవాద దాడుల్లో  చనిపోయిన వారి సంఖ్య మునుపటి సంవత్సరాలతో పోలిస్తే 9 శాతం తగ్గాయని, అయితే, ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాద సంస్థ ప్రోద్బలంతో ముష్కరులు ఆత్మాహుతి దాడులతో పేట్రేగిపోయారని పేర్కొంది  అందులో ఏ సంవత్సరంలోనూ జరగనంత నష్టం 2017లోనే జరిగిందని పేర్కొంది. 2017లో జరిగిన ఉగ్రదాడుల్లో 3,438 మంది చనిపోగా, 7,015 మంది గాయపడ్డారని ఐ రాస అఫ్ఘానిస్థాన్ సహాయ కార్యక్రమం నివేదికలో వివరించింది. తద్వారా 2017లో ఆత్మాహుతి దాడుల్లో మరణించిన వారి సంఖ్య 17 శాతం పెరిగిందని పేర్కొంది.

ఇక, మొత్తం ఉగ్రవాద దాడుల్లో అత్యధికంగా అఫ్ఘాన్ రాజధాని కాబూల్‌లోనే పౌరులు మరణించినట్టు ఐరాస తన  నివేదికలో తెలిపింది  1831 మంది 2017లో ఉగ్రదాడులకు అసువులుబాశారని పేర్కొంది. మరోవైపు 2018 మొదలైనప్పటి నుంచి కూడా పరిస్థితులు ఏమంత అదుపులోకి రాలేదని పేర్కొంది. 2009 నుంచి ఇప్పటిదాకా 28 వేల మంది చనిపోగా, 52 వేల మంది గాయపడినట్టు ఐరాస వెల్లడించింది. అఫ్ఘాన్‌లో ఆత్మాహుతి దాడుల్లో చనిపోయిన పౌరులపై ఐరాస ఓ నివేదికను విడుదల చేసింది. 

Related Posts