Highlights
- టీడీపీ, వైసీపీలను ఆహ్వానించినా..
- వాళ్ల పంథాలో వాళ్లు పోరాటం
- జేఎఫ్‌సీలో పవన్ కల్యాణ్ స్పష్టికరణ

ఎపి లో విభజన హక్కుల సాదాల కోసం " జేఎఫ్‌సీలో కలిసి పనిచేయడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు శుక్రవారం హైదరాబాద్ లో జేఎఫ్‌సీ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... జేఎఫ్‌సీ సమావేశాలు వరుసగా కొనసాగుతాయని చెప్పారు.ఈ భేటీల తర్వాత సబ్‌కమిటీల వేసే ఆలోచన ఉందన్నారు. వివిధ రంగాల ప్రముఖులతో భేటీ తర్వాత కార్యాచరణ జరుగుతుందాని చెప్పారు. జేఎఫ్‌సీ భేటీకి టీడీపీ, వైసీపీలను ఆహ్వానించినా రాలేదన్నారు. వాళ్ల పంథాలో వాళ్లు పోరాటం చేస్తున్నారన్నఅభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.జేఎఫ్‌సీ సమావేశానికి కాంగ్రెస్ నేతల అభిప్రాయం తెలుసుకునేందుకే పిలిచామే తప్ప వారిని కౌగిలించుకోవడం లేదు. ఏపీ ప్రయోజనాల కోసం నా ప్రయత్నం నేను చేస్తాను" అని పవన్ చెప్పుకొచ్చారు.
ఏపీకి వచ్చే నిధుల విషయంలో జరుగుతున్న అన్యాయంపై పోరాటంలో మా వంతు ప్రయత్నం మేం చేస్తామనిలోక్‌సత్తా నేత జయప్రకాశ్ నారాయణ స్పష్టం చేశారు. తమపై ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దని జేపీ అనడం గమనార్హం . ఈ సమావేశానికి కాంగ్రెస్ సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్, పద్మనాభయ్య, కొణతాల, చలసాని శ్రీనివాస్, సీపీఐ రామకృష్ణ, సీపీఎం మధు, గిడుగు రుద్రరాజు, గౌతమ్, వైసీపీ నేత తోట చంద్రశేఖర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన చంద్రశేఖర్ సమావేశానికి వ్యక్తిగతంగానే హాజరయ్యానని స్పష్టం చేశారు.