YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

విదేశీయం

‘ట్రంప్ నాతో శారీరక సంబంధం పెట్టుకున్నారు’

Highlights

  •  తొమ్మిది నెలల పాటు శారీరక సంబంధం 
  • లక్షా యాభై వేల డాలర్లతో ఒప్పందం
  • మాజీ మోడల్ కరెన్ మెక్‌డౌగల్ ఆరోపణ 
‘ట్రంప్ నాతో శారీరక సంబంధం పెట్టుకున్నారు’

ప్లే బాయ్ మాజీ మోడల్ తో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఉన్న లైంగిక సంబంధాల ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది, మాజీ మోడప్లే బాయ్ల్ అయిన కరెన్ మెక్‌డౌగల్(46) ఈ విషయాన్ని వెల్లడించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. గతంలో మాజీ పోర్న్‌‌స్టార్‌ స్టెఫానీ క్లిఫార్డ్‌తో అఫైర్ విషయమై చాలా కథనాలు వినిపించాయి. అప్పట్లో లక్షా ముప్పై వేల డాలర్ల ఒప్పందంతో ఆ అఫైర్ క్లోజ్ చేశాడని వార్తలు విన్నాం. ఇదిలా ఉండగానే.. తనతో కూడా ట్రంప్ లైంగిక సంబంధం పెట్టుకున్నాడంటూ మరో మహిళ మీడియా ముందుకు రావడం పెద్ద సంచలనంగా మారింది.


 ‘‘2006 ఎన్నికల సమయంలో తొమ్మిది నెలలు నాతో శారీరక సంబంధం కొనసాగించిన ట్రంప్.. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల టైమ్‌లో ఆ విషయం బయట పడకుండా లక్షా యాభై వేల డాలర్లతో ఒప్పందం కుదుర్చుకున్నాడు’’ అని  కరెన్  పేర్కొంది.
ట్రంప్‌పై ఈమె చేసిన ఈ ఆరోపణలను తాజాగా ‘న్యూ యార్కర్’ అనే ఆంగ్ల పత్రిక ప్రచురించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కాగా ఈ ఆరోపణల్లో నిజంలేదని ట్రంప్ ఖండించారు.

Related Posts