YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

తెలంగాణ లో ప్రజాస్వామ్యం ఖునీ

 తెలంగాణ లో ప్రజాస్వామ్యం ఖునీ
ఓటర్ లిస్ట్ లో పొరపాట్లు జరిగాయని ఎన్నికల సంఘం చెప్పింది. తప్పులకు కారణాలు అయినా అధికారులు ఎవరు. మరి ఎవరి పై చర్యలు తీసుకున్నారని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి ప్రశ్నించారు.  శుక్రవారం అయన మీడియాతో మట్లాడారు. ఎన్నికల సంఘానికి సరైన ఓటర్ లిస్ట్ తయారు చేయడానికి చిత్తశుద్ధి లేదు. అధికారపార్టీకి తొత్తుగా ఎన్నికల సంఘం మారింది. ప్రజాస్వామ్యని ఫుడ్ బల్ అడుకుంటుందని అన్నారు. ఓటర్ లిస్ట్ లో పొరపాట్లు చేసిన అధికారుల పైన తక్షణమే చర్యలు తీసుకోవాలి. క్యాబినెట్ సమావేశంలో ఎన్నికల సంఘాన్నికి కేసీఆర్ ధన్యవాదాలు చెప్పారు. అధికార పార్టీకి ఎన్నికల సంఘం అనుకూలంగా పని చేసినందుకు సీఎం కేసీఆర్ ధన్యవాదాలు చెప్పారని ఆరోపించారు. దేశంలోనే  నెంబర్ వన్ గా ప్రజాస్వామ్యాన్ని ఎలా తెలంగాణ లో ఖుని చేశారో కేసీఆర్ చూపిస్తున్నారు. గుణాత్మక మార్పు అంటూ కొన్ని రాజకీయ పార్టీలను కేసీఆర్ కలిశారు. తెలంగాణ లో ప్రజాస్వామ్యాన్ని ఎలా ఖుని చేశారో ఆ పార్టీలకు లేఖలు రాస్తాం. కేంద్ర ఎన్నికల సంఘం కూడా టి ఆర్ ఎస్ కు అనుకూలంగా వ్యవహరిస్తోంది. 30 లక్షల ఓట్లను ఎన్నికల సంఘం తొలగించిందని అన్నారు.

Related Posts