YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

సాహిత్యం

యుద్ధకాలంలో స్వప్నాలు.. బాల్యజ్ఞాపకాలు

Highlights

  • తెలుగులోకి జి.ఎన్‌.సాయిబాబా అనువాదం
యుద్ధకాలంలో స్వప్నాలు.. బాల్యజ్ఞాపకాలు

మలుపు ప్రచురణా సంస్థ ఆధ్వర్యంలో.. యుద్ధకాలంలో స్వప్నాలు.. బాల్యజ్ఞాపకాలు అనే పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. కెన్యా రచయిత గుగి వా థియాంగో రాసిన ఈ పుస్తకాన్ని తెలుగులోకి జి.ఎన్‌.సాయిబాబా అనువాదం చేశారు. ఆదివారం సాయంత్రం తెలుగు విశ్వవిద్యాలయంలోని ఎన్టీఆర్‌ ఆడిటోరియంలో... గుగి వా థియాంగో సహ విద్యార్థి ప్రొఫెసర్‌ సుజీతారు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఎన్‌.వేణుగోపాల్‌ అధ్యక్షతన ... జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పుస్తక మూల రచయిత గుగి వా థియాంగో, వక్తలుగా ఆంధ్రజ్యోతి సంపాదకులు కె. శ్రీనివాస్, ప్రముఖ సాహితీ విమర్శకులు ఎ.కె. ప్రభాకర్‌ పాల్గొన్నారు. రెండో ప్రపంచ యుద్ధ కాలంనాటి తన బాల్య స్మృతులకు గుగి వా థియాంగో ఇచ్చిన అక్షర రూపమే ఈ పుస్తకం. ఈ పుస్తకాన్ని సాయిబాబా తెలుగులోకి అనువాదం చేయడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు మూల రచయిత గుగి వా థియాంగో.

Related Posts