YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

విదేశీయం

సిరియా సంక్షోభం

Highlights

  • వైమానిక దాడిలో 77 మంది మృతి
  • మరో 40 మంది గాయాలు 
సిరియా సంక్షోభం

అరబ్‌ ప్రపంచాన్ని కుదిపేసిన స్వతంత్ర ఉద్యమాల బాటలో 2011 మార్చి 15న మొదలైన ఆందోళనలు ఏకథాటిగా కొనసాగుతున్నాయి. అందులో బాగానే జరిగిన సిరియా వైమానిక దళం దాడుల్లో 77 మంది పౌరులు మరణించారు. మరో 40 మంది గాయపడ్డారు.

సిరియా యుద్ధ విమానాలు డమస్కస్‌కు సమీపంలో ఉన్న ఈస్ట్రన్ గౌటా ప్రాంతంలో ఈ దాడులు నిర్వహించారు. సిరియా ప్రభుత్వ దళాలు ఈ దాడులు చేసినట్లు సమాచారం. సిరియా ఆర్మీ, మిలిటెంట్ల స్థావరాలను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. మిలిటెంట్లపై దాడులు జరుగుతున్నట్లు డమస్కస్ ప్రభుత్వం వెల్లడించింది.
ఈస్ట్రన్ గౌటాలో హమ్మురియా పట్టణంలో జరిగిన వైమానిక దాడిలో మహిళలు, పిల్లలతో సహా 20 మంది పౌరులు చనిపోయారని వైట్ హెల్మెట్స్ సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలిపింది.

"సాక్బా పట్టణంలో వైమానిక దాడుల్లో 14 మంది మృతి చెందారు. జీస్రిన్ పట్టణంలో జరిగిన వైమానిక దాడిలో నలుగురు చనిపోయారు" అని ఏజెన్సీ ప్రకటించింది. 'బెయిట్ సావ పట్టణంలో వైమానిక, గ్రౌండ్ దాడుల్లో 17 మంది పౌరులు చనిపోగా, 45 మంది గాయపడ్డారు. కఫ్ర్ బట్నా,జమాల్కా పట్టణాలలో ముగ్గురు పౌరులు మరణించారు' అని ప్రకటించింది. గతేడాది డిసెంబరు నుండి వరుసగా కొనసాగుతున్న వైమానిక దాడుల్లో.. 500 మందికి పైగా పౌరులు మృత్యువాతపడ్డారు. 2,000 మందికి పైగా గాయపడ్డారు. 2013 నుంచి ఈస్ట్రన్ గౌటా మిలిటెంట్ల ఆధీనంలో ఉన్నది.అక్కడ సుమారు 4 లక్షల మంది జీవిస్తున్నారు. డమస్కస్ సమీపంలో మిలిటెంట్ల ఆధీనంలో ఉన్న ఏకైక ప్రాంతం అది.


గత సంవత్సరం మేలో, రష్యా, ఇరాన్, టర్కీ దేశాలు సిరియాలో హింస, వైమానిక దాడులను తగ్గించేందుకు డి-ఎస్కలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసేలా ఒప్పందంపై సంతకాలు చేసాయి. డి-ఎస్కలేషన్ జోన్ కింద ఇమ్లిబ్ ప్రావిన్స్, లాటికియాలోని కొన్ని భాగాలు, హమా, అలెప్పో ప్రావిన్సెస్, హమ్స్, ఈస్ట్రన్ గౌటా, దక్షిణ సిరియాలోని దరా, అల్-క్యునైట్రా ప్రావిన్స్ లు ఉన్నాయి. సిరియా అధ్యక్షుడు బషర్ అల్‌ అసద్‌ గద్దె దిగాలంటూ మొదలైన ఆందోళనల్లో వేలాది అమాయలకు పిట్టల్లా రాలిపోతున్నారు. అరబ్‌ ప్రపంచాన్ని కుదిపేసిన స్వతంత్ర ఉద్యమాల బాటలో 2011 మార్చి 15న మొదలైన ఆందోళనలు ఏకథాటిగా కొనసాగుతున్నాయి.

Related Posts