YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల పోస్టర్ల ఆవిష్కరణ

శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల పోస్టర్ల ఆవిష్కరణ

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవ పోస్టర్లను టిటిడి తిరుపతి జెఈవో  బి.లక్ష్మీకాంతం టిటిడి పరిపాలనా భవనంలోని తమ కార్యాలయంలో సోమవారం సాయంత్రం  ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ ఈ నెల 25 నుంచి మార్చి 6వ తేదీ వరకు శ్రీకపిలేశ్వరాలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు  తెలిపారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 23వ తేదీ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, ఫిబ్రవరి 24వ తేదీ సాయంత్రం అంకురార్పణ నిర్వహించనున్నట్లు వివరించారు. పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామి, అమ్మ వార్ల కృపకు పాత్రులు కావాలని ఈ సందర్భంగా జెఈవో కోరారు.  ఈ కార్యక్రమంలో టిటిడి స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో  సుబ్రమణ్యం, ఏఈవో నాగరాజు, సూపరింటెండెంట్  రాజ్కుమార్, టెంపుల్ ఇన్స్పెక్టర్  దిలిప్,ఇతర అధికార ప్రముఖులు పాల్గొన్నారు.

Related Posts