YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

జ్ఞానమార్గం

కర్మ చేస్తూ..

Highlights

  • కర్మ బంధము లేకుండా జీవించుట
కర్మ చేస్తూ..

కర్మ - అంటే మనోవాక్కాయములతో చేసే పని. కానీభౌతికముగా చేసేదే పని అని దాని వల్ల కర్మ బంధాలుఏర్పడాతాయి అని, ఫలితాలు అంటుతాయి అనికొందరి వాదన. కనుక పని మానేస్తే ఫలితాలు అంటకమోక్షము వస్తుంది అని కొందరి వాదన. కానీభగవద్గీతలో భగవానుడు జ్ఞానయోగములో కర్మచేస్తూ కూడా చేయని వానివలే ఎలా ఉండాలి,ఫలితములు అంటకుండా ఎలా ఉండాలి అనిచెప్పియున్నాడు. అది ఎట్లా చేయవచ్చో తనజీవితములో ఆచరించి చూపించాడు.

చేసే పని జీవుని బంధించకుండా, మరల కర్మపుట్టకుండా, ప్రారబ్ద కర్మ పరిష్కారము అయ్యేవిథముగా ముక్తసంగుడై జీవించటానికి అవసరమైనవిషయాలను జ్ఞానయోగము నందుతెలియపరచటము జరిగింది. ఈ సూత్రములనుపాటించు వారికి కర్మ బంధము ఉండదు. కర్మలుచేయటము ఉంటుంది, కానీ అవి బంధించవు. ఇవిఆచరించగలమా లేదా అనే మీమాంస కలవారుఆచరించలేరు. ఎదో ఒక దానిని ఆచరించటముమొదలు పెట్టినచో అదే మిగతావాటిని ఒక్కొక్కటిగాదగ్గరకు చేర్చును. అవేమిటో ఒకసారి చూద్దాం....

1. కర్మల యందు కామ సంకల్పము లేకుండాచూసుకొనుట. కర్తవ్య కర్మను మాత్రమే చేయుట.యజ్ఞార్థము జీవించుట.

2. అందరియందు ఉన్న "నేను" అను ప్రజ్ఞ తనకుతానే పనిచేసుకుంటున్నాడు అనే జ్ఞానం కలిగిజీవించుట. ఆ జ్ఞానాగ్ని కర్మలన్నింటిని కాల్చివేస్తుంది.

3. కర్మఫలములను ఆశించకుండా జీవించుట.ఫలితములు వచ్చినా వలసింత అందుకొనిఇతరములను త్యాగము చేయట.

4. తృప్తిగా జీవించుట.

5. ఎవరిని ఆశ్రయించక నిరాశ్రయుడై జీవించుట.ఇతరములను ఆశ్రయించక దైవమును ఆశ్రయించుట.

6. ఆశలేక జీవించుట.

7. చిత్తమును నియమించి ఉంచుట. స్థిర చిత్తముకలిగి ఉండుట.

8. అపరిగ్రహము - దేనినీ ఊరక పొందే మనస్సు లేకఉండుట.

9. శరీర శ్రమ చేస్తూ ఉండుట. తను చేయవలసినపనికి ఇతరులపై ఆథారపడక తన పని తానుచేసుకొనుట. ఎక్కువ సౌఖ్యములకొరకుచూడకుండుట.

10. దొరికిన దానితో సంతృప్తి పొందుట.

11. ద్వందములకు అతీతముగా జీవించుట.ద్వందములు అనగా సుఖదుఃఖములు, శీతోష్ణములుమొ||

12. అసూయ లేకుండుట.

13. పనులు అవటము, అవకపోవటము నందుసమభావము కలిగివుండుట.

14. అయిపోయిన విషయములందు, రాబోవువిషయములందు ఆసక్తి లేక జీవించుట.

15. "నేను" అను ప్రజ్ఞను సమస్తమునందు దర్శించిజీవించుట.

16. సమస్తమును బ్రహ్మమునకు అర్పణము చేసిజీవించుట.

జీవితము నందు ఇటువంటి వాటిని ఆచరించకుండాఎన్ని పూజలు చేసినా ఎన్ని ప్రార్థనలు చేసినాఉపయోగము ఉండదు. పూజైనా, ప్రార్థనైనా మొదలుపెట్టక ముందే దాని ఫలితము ఊహిస్తాము.చేస్తున్నంత సేపూ ఫలితము గురించి ఆలోచిస్తాము.ఊహించినది దొరకనిచో మళ్ళీ ఆ పూజవంకచూడము. ఎవరన్న్ ఫలానా పూజ చెయ్యండి అంటే...ఏమి పూజలు లెండి ఎన్ని చేసినా ఉపయోగమాపాడా...అంటూ దీర్ఘాలు తీస్తాము. అంటే కర్మచేస్తున్నాము అంటే ఫలితమాసించే. ఇక కర్మచుట్టుకోక ఏమవుతుంది. కర్మలు చేస్తూకర్మలంటకుండా జీవించుటకొరకు కావలసినస్థిరత్వాన్ని మనసుకు అందివ్వమని దైవన్నిప్రార్థించాలి. పై సూత్రములన్నీ ఆచరించుట సాథ్యముకాదు. ఎదో ఒకదానిని శ్రద్దగా అనుస్యూతముచేస్తూవెళ్ళినచో తప్పక స్థిరత్వము లభిస్తుంది. అదేఒక్కొక్కటిగా మితగా వాటిని ఆచరణలోనికి తీసుకువస్తుంది. జీవుడు వేసుకున్న ముడులను ఒక్కొక్కటిగాతొలగిస్తాయి. ప్రపంచములో ఉంటాము కానిప్రపంచము చేత బంధింప బడము. అన్నీ ఉంటాయికానీ ఏదీ కూడా బంధించదు. అదే నిజమైన మోక్షము.మోక్షము అంటే వచ్చేది కాదు. ఉన్నది పోతే మిగిలేది.ఏది పోతే బంధము పోతే..

నిజమునకు ప్రపంచములోని ఏ విషయము కూడాబంధించదు. జీవుడు దానితో ఏర్పరుచుకున్నసంబంధము వల్ల అది జీవుని బంధిస్తుంది. పై వాటిలోఏ ఒక్కదానిని ఆశ్రయించినా మనకు బయటపడటానికి మార్గము దొరుకుతుంది. మనిషిజీవన్ముక్తుడవుతాడు.

Related Posts