YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

జై జగన్నాధ్

జై జగన్నాధ్
శ్రీకృష్ణుడు శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు దహన సంస్కారాలు జరిగాక ఆయన శరీరమంతా ఐదు మూలకాలలో కలుపారు కానీ ఆయన గుండె ఒక సాధారణ మనిషి గుండెలా కొట్టుకుంటూనే ఉంది.ఆయన గుండె ఈనాటి వరకూ సురక్షితంగా ఉంది. ఇది  జగన్నాథుని  చెక్క విగ్రహం లో ఉంది. అలా కొట్టుకుంటూనే ఉంది. పూరీజగన్నాథ్ (శ్రీ కృష్ణుడి) ని కలియుగ ప్రభువు అని కూడా అంటారు. ప్రతి 12సంవత్సరాలకు ఒకసారి మహాప్రభు విగ్రహం మార్చబడుతుంది. ఆ సమయంలో పూరి నగరం మొత్తం చీకటిగా మారుతుంది.  అంటే మొత్తం నగరం అంతటా లైట్లు ఆపివేయబడతాయి.  లైట్లు ఆపివేసిన తరువాత సిఆర్ పిఎఫ్. సైన్యం అన్ని వైపుల నుండి ఆలయ ప్రాంగణాన్ని చుట్టుముడుతుంది.ఆ సమయంలో ఎవరూ ఆలయంలోకి ప్రవేశించలేరు.ఆలయం లోపల దట్టమైన చీకటి ఉంటుంది. పూజారి కళ్ళు కట్టుకుంటారు... పూజారి చేతిలో చేతి తొడుగులు ఉంటాయి.. పాత విగ్రహం నుండి "బ్రహ్మ పదార్ధం" తీసి కొత్త విగ్రహంలోకి మార్చుతారు...  ఈ బ్రహ్మ పదార్ధం ఏమిటో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు ... ఈ రోజు వరకు ఎవరూ చూడలేదు.  .. వేలాది సంవత్సరాలుగా ఇది ఒక విగ్రహం నుండి మరొక విగ్రహానికి బదిలీ చేయబడుతూనే ఉన్నది.  ఈ రోజు వరకు మహాప్రభు జగన్నాథ్ విగ్రహంలో ఏముంది అని ఏ పూజారి కూడా చెప్పలేకపోయారు.  కొంతమంది పూజారులు మేము చేతిలో తీసుకున్నప్పుడు ఆయన కుందేలు లాగా దూకుతున్న అనుభూతి కలిగిందని చెప్పారు. ఇప్పటికీ జగన్నాథ్ యాత్ర సందర్భంగా పూరి రాజు స్వయంగా బంగారు చీపురుతో ఊడుస్తాడు. చాలా దేవాలయాల శిఖరాలపైన పక్షులు కూర్చుని ఎగురుతూ ఉండడాన్ని మనం చూస్తూంటాం. కాని జగన్నాథ్ ఆలయం మీదుగా ఏ పక్షి కూడా ఎగరదు.  జెండా ఎల్లప్పుడూ గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతుంది.  జగన్నాథ్ ఆలయం యొక్క 45 అంతస్తుల శిఖరంపై ఉన్న జెండాను ప్రతిరోజూ మార్చడం జరుగుతుంది, జెండాను ఏరోజైనా మార్చకపోతే ఆనాటినుండి ఆలయం 18 సంవత్సరాలపాటు మూసివేయ బడుతుంది.  జగన్నాథ్ ఆలయం పైభాగంలో ఉన్న సుదర్శన్ చక్రం ఏదిశ నుండి చూసినా అది  మనకు ఎదురుగానే  ఉన్నట్లు కనిపిస్తూ ఉంటుంది.  జగన్నాథ్ ఆలయ వంటగదిలో 7 మట్టి కుండలు ఒకదానిపైన ఒకటిఉంచి ప్రసాదాన్ని కట్టెలపొయ్యి మీదనే వండుతారు.  జగన్నాథ్ ఆలయంలో ప్రతిరోజూ చేసిన ప్రసాదం భక్తులకు ఎప్పుడూ తగ్గదు. కాని ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆలయ తలుపులు మూసిన వెంటనే ప్రసాదం కూడా ముగుస్తుంది.

Related Posts