YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

*ఆ శివుడి అనుగ్రహం ఈ ‘కన్నప్ప’ చిత్రంపై ఉండాలని కోరుకుంటున్నాను..

*ఆ శివుడి అనుగ్రహం ఈ ‘కన్నప్ప’ చిత్రంపై ఉండాలని కోరుకుంటున్నాను..

*‘తుడరుమ్’ కంటే ఎక్కువ కలెక్షన్స్ ఇవ్వాలని మోహన్‌లాల్ అభిమానుల్ని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మోహన్ బాబు*                                                                                
*మోహన్‌లాల్ గారితో నటించడం, స్క్రీన్ షేర్ చేసుకోవడం నా పూర్వ జన్మ సుకృతం.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో విష్ణు మంచు*
డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ మూవీని అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద ఎం. మోహన్ బాబు నిర్మించారు. ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, పాటలు, పోస్టర్లు సినిమాపై అంచనాల్ని పెంచేశాయి. ఇక శనివారం నాడు కొచ్చిలో ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఇక ఈ మేరకు నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో..
*మోహన్‌లాల్ మాట్లాడుతూ* .. ‘ప్రస్తుతం అంతా ప్యాన్ ఇండియన్ ట్రెండ్ నడుస్తోంది. భాషా హద్దుల్లేకుండా సినిమాల్ని తీస్తున్నారు. ‘కన్నప్ప’ చిత్రం అద్భుతంగా వచ్చింది. ఇంత మంచి చిత్రంలో నేను కూడా భాగమైనందుకు ఆనందంగా ఉంది. అన్ని భాషల నటీనటులు, ఆర్టిస్టులు, టెక్నీషియన్లు కలిసి ఈ మూవీని చేశారు. ఇంత మంచి పాత్రను నాకు ఇచ్చిన మెహన్ బాబు గారికి, విష్ణుకి థాంక్స్. శివుడుకి కన్నప్ప గొప్ప భక్తుడు. అలాంటి గొప్ప భక్తుడి కథను ఎంతో గొప్పగా నిర్మించారు. న్యూజిలాండ్‌లో ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించారు. మోహన్ బాబు గారి ఫ్యామిలీ అంటే నా ఫ్యామిలీ. ఆ శివుడి అనుగ్రహం ఈ ‘కన్నప్ప’ చిత్రంపై ఉండాలని కోరుకుంటున్నాను. జూన్ 27న ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ పెద్ద విజయం సాధించాలని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
*డా. మోహన్ బాబు మాట్లాడుతూ* .. ‘‘మోహన్‌లాల్ నాకు సోదరుడి వంటి వారు. ఇక్కడ మోహన్‌లాల‌్‌తో ప్రియదర్శిని తీసిన ‘చిత్రం’ మూవీని తెలుగులో నేను ‘అల్లుడు గారు’ అని రీమేక్ చేశాను. అలా జీరో నుంచి మళ్లీ స్టార్ హీరోగా నిలిచాను. అలా మా బంధం మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు లాల్ ఏమాత్రం మారలేదు. శారీరకంగా, మానసికంగా అలానే ఉన్నారు. స్వచ్చమైన ఆలోచనలు, హృదయం ఉన్నవారే ఇలా ఉండగలుగుతారు. మోహన్‌లాల్ గారు గొప్ప నటులు. ఆయన ఎంత స్థాయిలో ఉన్నా కూడా వెంట ఒక మేకప్ మెన్ మాత్రమే వస్తారు. మా అందరి కంటే సెట్‌లోకి ముందు వస్తుండేవారు. ఈ మూవీ కోసం ఇంత వరకు మోహన్‌లాల్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఆయన చూపించిన ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. లాల్ గారితో నటించే అవకాశం విష్ణుకి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నా ఇన్నేళ్ల కెరీర్‌లో ఆయనతో కలిసి ఎప్పుడూ నటించలేకపోయాను.  ఇప్పుడైనా నాకు ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నాను. జూన్ 27న మా కన్నప్ప చిత్రం రాబోతోంది. అందరూ చూసి మా చిత్రయూనిట్‌ను ఆశీర్వదించండి. ‘తుడరుమ్’ కంటే ఎక్కువ కలెక్షన్స్ ఇవ్వాలని మోహన్‌లాల్ అభిమానుల్ని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
*విష్ణు మంచు మాట్లాడుతూ.* . ‘‘కన్నప్ప’ గురించి ఇక నేను చెప్పాల్సిన పని లేదు. మీరు ఆల్రెడీ విజువల్స్ చూశారు. ఈ మూవీ ఆ శివుడి ఆశీస్సులతోనే జరిగింది. మా చిత్రం జూన్ 27న రాబోతోంది. మోహన్‌లాల్ గారికి నేను పెద్ద అభిమానిని. ఆయన నాకు తండ్రి సమానులు. ఆయన మా కుటుంబ సభ్యులు. మోహన్‌లాల్ గారి ప్రభావం అన్ని తరాలపై ఉంటుంది. ట్రైలర్ చూస్తే మోహన్‌లాల్ గారి పాత్ర ఏంటో అర్థం అవుతోంది. ఆ సర్ ప్రైజ్ ఏంటో నేను ఇప్పుడే చెప్పలేను. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం నా పూర్వ జన్మ సుకృతం. మోహన్‌లాల్ గారు ఎంతో ఒదిగి ఉంటారు. ప్రభాస్ నా స్నేహితులు. మా నాన్న గారంటే ప్రభాస్‌కి ఎనలేని గౌరవం ఉంటుంది. మా మూవీని రిలీజ్ చేస్తున్న ఆశీర్వాద్ సినిమాకు థాంక్స్’ అని అన్నారు.
*ముఖేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ* .. ‘పరుశురాముడు, ఆది శంకరాచార్యులు నడయాడిన నేల ఇది. ఆది శంకరాచార్యులు శివుడికి గొప్ప భక్తుడు. కన్నప్ప కూడా గొప్ప శివ భక్తుడు. సినిమాను అందరూ ప్రేమతో, ఇష్టంతో తీస్తారు. మేం మాత్రం ఈ మూవీని శివుడికి ఓ ప్రార్థనలా తీశాం. శివతత్త్వాన్ని చాటేలా ఈ మూవీని తీశాం. మోహనుడు అని కృష్ణుడ్ని అంటాం. అలా నేను ఈ మూవీలో ఇద్దరు మోహన్‌లతో పని చేశాను. మోహన్ బాబు గారు, మోహన్‌లాల్ గారు అద్భుతమైన నటులు. నటనపై ప్యాషన్, డెడికేషన్, సినిమా పట్ల ఉన్న నాలెడ్జ్ గురించి మోహన్ బాబు గారి నుంచి ఎంతో నేర్చుకున్నాను. లాల్ గారి నటన గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆఫ్ స్క్రీన్‌లో లాల్ గారిని చూసిన తరువాత నేను కూడా ఆయనలానే ఉండాలని అనుకుంటున్నాను. విష్ణు ఈ మూవీ కోసం ఎంతో కష్టపడ్డారు. అయ్యప్వ స్వామి గుడిని ఈ రోజు తెరుస్తున్నారు. ఈ రోజు మా ట్రైలర్‌ను రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. ఆ అయ్యప్ప స్వామి ఆశీస్సులు కూడా మా సినిమాపై ఉండాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
*అర్పిత్ రంకా మాట్లాడుతూ* .. ‘‘కన్నప్ప’ లాంటి చిత్రంలో అవకాశం రావడం అదృష్టం. ఆ శివుడి ఆశీస్సులతోనే ఈ మూవీని చేయగలిగాం. విష్ణు గారు, మోహన్ బాబు గారు, అక్షయ్ కుమార్ గారు, మోహన్‌లాల్ గారు, ప్రభాస్ గారు వంటి వారితో పని చేయడం ఆనందంగా ఉంది. రీసెంట్‌గా నేను మోహన్‌లాల్ గారి తుడరం సినిమా చూశాను. అద్భుతంగా అనిపించింది. కన్నప్ప లాంటి చిత్రంలో నటించడం ఆనందంగా ఉంది. మా సినిమాను జూన్ 27న అందరూ చూడండి’ అని అన్నారు.
*ముఖేష్ రిషి మాట్లాడుతూ* .. ‘‘కన్నప్ప’ కోసం విష్ణు చాలా కష్టపడ్డారు. ఇంత గొప్ప చిత్రంలో నటించినందుకు ఆనందంగా ఉంది. విష్ణు మా అందరినీ ఎంతో అద్భుతంగా చూసుకున్నారు. ఈ మూవీని ఆ శివుడు ఆశీర్వదిస్తారు. మోహన్ బాబు గారితో పని చేయడం ఆనందంగా ఉంది. కన్నప్ప టీంకు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.
*ఆశీర్వాద్ అధినేత ఆంటోని పెరంబవూర్ మాట్లాడుతూ* .. ‘మోహన్ బాబు గారి సినిమా అంటే మా సినిమా. ఇది మా సొంత చిత్రం. ఈ మూవీని అందరూ ప్రేమిస్తారు’ అని అన్నారు.

Related Posts