YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కేటీఆర్ .. నీ డ్రామాలు, దొంగ నాటకాలు ఆపు

కేటీఆర్ .. నీ డ్రామాలు, దొంగ నాటకాలు ఆపు

హైదరాబాద్
చట్టం మీద గౌరవం ఉందని అంటూనే కేటీఆర్ సన్నాయి నొక్కులు నొక్కు తున్నాడు. సత్యహరిశ్చంద్రుడి లా కేటీఆర్ తెగ బిల్డప్ ఇస్తున్నాడని ఎమ్మెల్సీ బల్యూర్ వెంకట్ మండిపడ్డారు. అధికారులకు అవసరమైతే మూడు సార్లు కాదు 300 సార్లైనా పిలుస్తారు..వెళ్లాల్సిందే. కేటీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే విచారణ లో నిజాయితీ గా సమాధానాలు చెప్పాలి. కేసులు బనాయించాల్సిన అవసరం మా  ప్రభుత్వానికి ఏ మాత్రం లేదు. ఈ ఫార్ములా రేస్ అస్తవ్యస్థంగా నిర్వహించి దొరికిపోయింది కేటీఆర్. మంత్రి వర్గం అనుమతి లేకుండా ఇష్టానుసారంగా విదేశీ కంపెనీ కి 55 కోట్లు చెల్లించింది నువ్వని అన్నారు.
నిబంధనలు పాటించకుండా, ఆర్బీఐ కి చెప్పకుండా డబ్బులు పంపించ మన్నది నువ్వు. అడ్డంగా దొరికిపోయి నంగనాచి లా కేటీఆర్ కబుర్లు చెపుతున్నాడు. కేవలం విచారణ కు పిలిస్తేనే పైశాచిక ఆనందం  తెగ ఆవేదన వ్యక్తం చేస్తున్నావు.. అక్రమ కేసుల్లో ఇరికించి మా రేవంత్ రెడ్డిని, మమ్మల్ని రోజుల తరబడి జైల్లో పెట్టినదాన్ని ఏమనాలి.. పైశాచిక ఆనందం లేక శాడిజమా ..?  అరెస్టులకు భయపడనని తెగ బిల్డప్ లు ఇస్తున్నావు..  నీ కోరిక నెరవేరాలని మేం కూడా కోరుకుంటున్నాం. నీ అవినీతి, అక్రమాలు దర్యాప్తులో బయటపడితే ఒక్కసారి కాదు వందసార్లైనా జైలుకు వెళ్లాల్సి వస్తుంది.. రెఢీ గా ఉండు.  కేటీఆర్ .. నీ డ్రామాలు, దొంగ నాటకాలు ఆపు. నీ కుటుంబ సభ్యులే నిన్ను దెయ్యం అంటున్నారు. బిడ్డా కబడ్దార్.. నువ్వు , నీ అయ్య ను తెలంగాణ ప్రజలు నేలకేసి కొట్టారు.  వచ్చే ఎన్నికల్లో నువ్వు కనీసం ఎమ్మెల్యే గా గెలిచే పరిస్థితి కూడా ఉండదని అన్నారు.

Related Posts