YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

జ్ఞానమార్గం

దేవుడు_ఉన్నాడా..?

Highlights

  • దేవుడు..అబద్ధం కాదు.
  • దాని పేరుతో జరిగే ప్రతీ క్రియ అబద్ధం.
  • అందరినీ ఒకే శక్తి రూపొందించినపుడు...
  • అందరి దేవుడు ఒక్కడే అయినప్పుడు...
  • ఈ మత విద్వేషాలు అర్థ రాహిత్యం.​​​​​​​
దేవుడు_ఉన్నాడా..?

ప్రపంచంలో చాలా మందికి ఎదురయ్యే ప్రశ్న దేవుడు_ఉన్నాడా అని. ఇది చాలా.. సున్నితమైన ప్రశ్న.ఉంటే...మరి ఎలా ఉన్నాడు?.,ఎక్కడ ఉన్నాడు.?

బ్రిటన్ తత్వవేత్త మరియు సైన్టిస్ట్ "ఐన్ స్టీన్" ప్రకారం. సృష్టి అనేది (అంటే...భూమి..సూర్య కుటుంబం.. చంద్రుడు..నక్షత్రాలు అన్నీ..) ఒక క్రమ పద్ధతిలో నడుస్తున్నాయి.
"There is some power
Which is controls total universe" 
అని ఆయన చెప్పాడు

అనంతమైన ఈ విశ్వం ఒక ఊహకందని స్వరూపం. ఈ సుందరమైన..అనంత విశ్వంలో..కొన్ని కోట్ల నక్షత్రాలు.ఎలా పుట్టాయి.?
ఎలా ఇలా ఒక క్రమమైన.. పద్ధతిలో..దేనికదే సూత్రాలను రూపొందించుకొని ఉండగలుగుతున్నాయి.?

అసలు సైన్స్ దేవుడ్ని నమ్ముతుందా.. ?, నమ్మదా? .,సైన్స్ దేవుడిని నమ్మదని ఏ పుస్తకంలో నైనా చదివారా?ఎవరైనా భోధించారా? .ఇంతవరకు ఎవరూ అలాంటి పుస్తకాన్ని రచించలేదు.. భోధించలేదు...అలా అని నమ్ముతుంది అని కూడా నేను చెప్పడం లేదు.

భూమి గుండ్రంగా ఉంది.,సూర్యుడు..ఇంత దూరంలో ఉన్నాడు..,చంద్రుడు భూమి చుట్టూ ఈ వేగంతో తిరుగుతున్నాడు అనే విషయాలను మన సైన్స్..చెబుతుంది.అంటే..ఇప్పటికే ఉన్న విషయాలను వివరిస్తుంది. కానీ...కొత్తగా ఏమీ కనుక్కోలేదు సైన్స్. కనుక్కోదు కూడా.

మరి...ఈ విశ్వ రహస్యాల వెనుక ఏదో లేనిది... ఇంత పర్ఫెక్ట్ గా విశ్వం ఎలా నడుస్తుంది.?.దీనికి సైన్స్ చెప్పే సూత్రం...శక్తి.

మనం ఇప్పుడు నమ్మే.. సైన్స్ కు ఆది నియమాలు అందించిన..సర్ న్యూటన్  "మొదటి గమన సూత్రం" ఆధారంగా...
"శక్తిని సృష్టించలేము.. నాశనం చేయలేము. ఒక రూపంలో నుండి..మరో రూపం లోకి మార్చుకోగలము"

మరి... ఆ శక్తి...ఎక్కడిది?.ఎక్కడ ఉంది...ఎలా ప్రసరిస్తుంది..ఎలా మార్పుచెందుతుంది?.,ఎందుకు మార్పుచెందుతుంది?

ఆఖరి మూడు ప్రశ్నలను మన సైన్స్ విప్పగలదు. మరి మొదటి రెండు ప్రశ్నల్లోనే దాగి ఉంది...అసలు గుట్టంతా....అదే "శక్తి" మహిమ.

ఈ శక్తినే... దేవుడిగా నమ్ముతున్నాం.
శక్తిని ఏవిధంగా అయితే సృష్టించలేమో... దేవుడిని కూడా ఎవరో...కూర్చొని తయారు చేయలేదు.
శక్తి ఎలా అయితే విశ్వాన్ని సృష్టించిందో..దేవుడు అలాగే సృష్టికర్త.
అంటే..సైన్స్ చెప్పే శక్తి...దేవుడు..ఒకటే అన్నమాట. ఈ రెండూ పర్యాయ పదాలు అనుకోవచ్చు.

అంటే ఇప్పుడు దేవుడు ఉన్నట్టేగా..మరి ఇప్పుడు ప్రపంచంలో రకరకాల మతస్తులున్నారు.ముఖ్యంగా... 3 మతాల వారు...
 క్రిస్టియన్స్  వాళ్ళు...యేసు దేవుడంటారు. ‎ముస్లీమ్స్ ... మహ్మద్ ప్రవక్త..చెప్పిన అల్లాహ్..దేవుడంటారు. ‎హిందువులు... రాముడు..కృష్ణుడు..సాయి..దేవుడంటారు.

నాకు ఒకటి చెప్పండి..మనందరినీ.. ఒకటే దేవుడు పుట్టించాడా..లేకపోతే... ముగ్గురా?
ఒక్కడే కదా... అది మీరు నమ్ముతున్నారు కదా...ఆ ఒక్కడు ఎవరు?

భగత్ గీత ప్రకారం...
దేవుడు అనంతమైన వాడు... సృష్టికర్త... అనంత రూపం కలిగి...ఉన్నాడు. చారా చర సృష్టిని పుట్టించాడు. అతను పరలోకంలో ఉన్నాడు.

ఖురాన్ ప్రకారం..మహ్మద్ ప్రవక్త ప్రకారం..
అల్లాహ్.. మనల్ని పరలోకం నుండి గమనిస్తున్నారు. మనం చేసే క్రియలు పాప రహితమై ఉండాలి

బైబిల్ ప్రకారం..ఏసు ఈ దినమున కొండపైకి వెళ్లి ప్రార్థన చేసెను. మరుసటి దినమున కొండ నుండి దిగెను.

పై మూడు గమనిస్తే... దేవుడు అనే వాడు భూమిపై లేదు.ఎక్కడో ఉన్నాడు. అని అర్థం.

రాముడు, కృష్ణుడు, సాయి, యేసు, మరియమ్మ, ప్రవక్త వీళ్ళందరూ..భూమిపై పుట్టి మరణించిన వారు. కాబట్టి వీళ్ళు దేవుండ్లు కారు. దేవుడు పుట్టేవాడు కాదు....పుట్టించేవాడు.దేవుడు మరణించే వాడు కాదు... మరణాన్ని కల్పించే వాడు.దేవుడు ఒక చోట ఉండే వాడు కాదు. అంతా తానై ఏర్పర్చిన వాడు.

దేవుడికి రూపం ఉందా?
కచ్చితంగా లేదు. ఎందుకంటే..ఏ రూపం లేనివాడే దేవుడు. ఒక రూపానికి, ప్రాంతానికే దేవుడిని పరిమితం చేయడం మన అవివేకం. ఈ గుడులు.. మసీదులు..చర్చిలు..నిర్మాణాల వల్ల..ఏమీ లాభం లేదు. విగ్రహారాధన...ఒక పిచ్చి.

దేవుడు మన కోరికలను_తీరుస్తాడా?
లేదు. తీర్చడు.
దేవుడు మనకు ఇవ్వాల్సింది ముందే ఇచ్చేసాడు. ఇంకా ఎం ఇవ్వడు.
అన్ని జీవాలను ఏర్పరచినట్టు మనల్ని ఏర్పరచాడు.,అన్ని జీవాల లాగా..బ్రతకాలి.,నువ్ కోరే డబ్బు...దేవుడు సృష్టి కాదు.
నువ్ అడిగే విలాసాలు నీ సుఖం కోసం నువ్ తయారు చేసుకున్నవి. దేవుడికేం సంబంధం? ఎలా ఇస్తాడు.? పిచ్చి కాకపోతే.

దేవుడిని ఎలా పూజించాలి..?
అసలు పూజలు చేయమని దేవుడు చెప్పాడా? అది  భ్రమ. పూజలు అవివేకం.
ఎవడి పని వాడు చేయడమే..పెద్ద పూజ.,దేవుడికి మనం ఇచ్చే ఏ వస్తువు అయినా...దేవుడి సృష్టే.,అలాంటిది ఆయన వస్తువు ఆయనకిచ్చి పూజ అనడం పనికిరాని పని. నువ్వు చేసే ఈ పనుల వల్ల ఆయన ఇచ్చిన ఈ జీవితంలో కాల యాపన చేయడమే.

మరి ఏం చేయాలి... 

దేవుడు ఉన్నాడు. కానీ..,దేవుడిని నమ్మిన నమ్మక పోయినా...నిన్ను ఎవడూ శిక్షించడు.భూమిపై పుట్టేవాడు దేవుడు కాదు. ఇది మూఢనమ్మకం. మన సృష్టి అనేది ఇప్పటికే తయారు చేయబడినది. కొత్తగా ఏమీ ఉండదు. కనుక దేవుడు ఏమీ ఇవ్వడు. దేవుడి పేరుతో జరిగే ఏ కార్యమైనా.. స్వార్థ బుద్ధితో ఏర్పడినవి అయి ఉంటాయి. లేదా జీవనోపాధి కోసం అయి ఉంటాయి.
మనమంతా ఒక్కటే....మనుషులంతా ఒక్కటే.
ప్రయత్నం...కృషి...పట్టుదల...విజయాన్ని అందిస్తాయి.

Related Posts