YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

విదేశీయం

అమెరికా చట్రంలో హెచ్1బీ వీసా

Highlights

  • భారతీయ ఐటీ కంపెనీలపై తీవ్ర ప్రభావం 
అమెరికా చట్రంలో హెచ్1బీ వీసా

 హెచ్1బీ వీసాల జారీపై అమెరికా ప్రభుత్వం కొత్త విధానాలను ప్రకటించింది. ఆ విధానం భారతీయ ఐటీ కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపనున్నది. అమెరికాకు ప్రొఫెషనల్ ఉద్యోగులను పంపాలనుకుంటున్న ఆయా భారతీయ కంపెనీలు ఇక నుంచి తమ ఉద్యోగులకు సంబంధించిన అదనపు వివరాలను వెల్లడించాల్సి ఉంటుంది. థార్డ్ పార్టీ వర్క్‌సైట్లకు ఉద్యోగులను పంపాలనుకుంటే, కొత్త వీసా విధానం వల్ల ఆయా కంపెనీలు మరింత సమాచారం పొందుపరచాల్సి ఉంటుంది. హెచ్1బీ వీసా ద్వారా ఐటీ ఉద్యోగులు కొన్ని నెలల లేదా సంవత్సరాల కోసం అమెరికా వెళ్తుంటారు. అయితే హెచ్1బీ వీసాను ఎక్కువ శాతం భారతీయ ఐటీ కంపెనీలు వాడుతుంటాయి. థార్డ్ పార్కీ వర్క్‌సైట్‌లో ఎన్ని రోజులు పని ఉంటుందో, అన్ని రోజుల వరకే హెచ్1బీ వీసాను జారీ చేయాలని ట్రంప్ ప్రభుత్వం ఆ దేశ ఇమ్మిగ్రేషన్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. 2019వ సంవత్సరానికి ఏప్రిల్ 2వ తేదీ నుంచి హెచ్1బీ వీసా దరఖాస్తులు జారీ చేయనున్నారు. అయితే నూతన మార్గదర్శకాలు ఈ సీజన్ నుంచి అమలుకానున్నాయి. సాధారణంగా హెచ్1బీ వీసాను మూడేళ్ల కోసం జారీ చేస్తారు. ఒకవేళ ఉద్యోగులు ఎవరైనా బెంచ్ మీద ఉంటే, వాళ్లను వెంటనే స్వదేశానికి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హెచ్1బీ వీసా కోరే కంపెనీలు తమ ఉద్యోగికి సంబంధించి పేపర్ వర్క్‌ను విస్తృతస్థాయిలో చేయాల్సి ఉంటుంది. ఎటువంటి ఉద్యోగం చేస్తాడు, ఎన్ని గంటలు చేస్తాడు, ఎన్ని రోజులు చేస్తాడు, ఎంత సంపాదిస్తాడా అన్న అంశాలను కూడా చేర్చాల్సి ఉంటుంది.

Related Posts