YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ప్రధాని మోదీ హిట్లర్‌ : కేజ్రీవాల్‌

ప్రధాని మోదీ హిట్లర్‌ :  కేజ్రీవాల్‌
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రధాని మోదీని హిట్లర్‌తో పోలుస్తూ విమర్శలు చేశారు. హిట్లర్‌ తరహాలోనే మోదీ కూడా విమర్శకులపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ‘‘హిట్లర్‌ పాలనలో గూండాలు అమాయక ప్రజలను హింసించి చంపేవారు. అనేక మందిపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేసేవారు. మోదీ కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు. అధికారం కోసం హిట్లర్‌ సిద్ధాంతాలను పాటిస్తున్నారు. కానీ అది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో మోదీ అనుచరులకు అర్థం కావడం లేదు’’ అని కేజ్రీవాల్‌ ట్విటర్‌ వేదికగా విమర్శలు గుప్పించారు.హరియాణాలోని గురుగ్రామ్‌లో ఓ మైనారిటీ కుటుంబంపై కొంత మంది దాడి చేశారని వస్తున్న వార్తల నేపథ్యంలో కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కూడా ఆయన ట్విటర్‌ లో పోస్ట్‌ చేశారు. ‘ఇలాంటి దాడులు చేయాలని ఏ గీత చెబుతుంది? ఏ రామాయణంలో రాసుంది?’ అని ప్రశ్నించారు.

Related Posts