YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

సాహిత్యం

"రీసెర్చ్ ఇండియా ప్రెస్" ప్రచురణ 

Highlights

  • అమ్ముడైన రెండు వేల కాఫీలు 
"రీసెర్చ్ ఇండియా ప్రెస్" ప్రచురణ 

తెలంగాణ రాష్ట్ర బి.సి.కమిషన్ గౌరవ సభ్యులు డాక్టర్. ఆంజనేయ గౌడ్ గారు సామాజిక న్యాయం మరియు బి.సి. లపై వ్రాసిన పరిషోధన గ్రంథాన్ని ఢిల్లీ కి చెందిన జాతీయ స్థాయి ప్రముఖ  ప్రచురణ సంస్థ  "రీసెర్చ్ ఇండియా ప్రెస్"  ప్రచురించింది.సామాజిక న్యాయం మరియు భారత దేశ సామాజిక, ఆర్థిక రంగాల్లో ఒ.బి.సీ. ల అభివృద్ధి:ప్రభుత్వ ఉద్యోగ రంగంపై ప్రత్యేక ద్రుష్టి."  అనే ఈ గ్రంథం లో 7౦ ఏళ్ల దేశ, రాష్ట్రాల ప్రభుత్వాల పాలనా విధానాలు, వివిధ రంగాల్లో బి.సి లకు జరిగిన అన్యాయాన్ని శాస్త్రీయ గణాంకాల తో సహా వివరించారు.1953 నుంచి జాతీయ మరియు వివిధ రాష్ట్రాల బి.సి కమిషన్ ల అధ్యయనాలు,ఆయా కేంద్ర, రాష్ట్రా లకు సమర్పించిన నివేదిక లు వాటిపై జాతీయ, వివిధ రాష్ట్రాల ప్రభుత్వాల చర్యలను గ్రంథం లో లోతుగా చర్చించారు.ఏడు అధ్యాయాలు ,362 పేజీ లతో వెలువడిన ఈ పుస్తకం లో సామాజిక న్యాయ సిధ్ధాంతం,భారత రాజ్యాంగ ద్రృక్పధం, బి.సి.వర్గాల కు రాజ్యాంగం కల్పించిన హక్కులు,రిజర్వేషన్లు, న్యాయస్థానాల తీర్పు లు,మండల్ కమిషన్ అనంతర రాజకీయ, సామాజిక పరిణామాలు, వివిధ రంగాల్లో దేశంలో ప్రస్థుత ఒ.బి.సి ల స్థితి తదితర అనేక అంశాలపై లోతుగా పరిశోధించి ఈ గ్రంథం లో సమగ్ర వివరాలు అందించారు.పాట్నా(బీహార్) హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్. ఎల్.నర్సింహారెడ్డి ఈ గ్రంధానికి వ్రాసిన ముందు మాటలో "అధ్యయన పరిశోధకులకు మరియు విధానాలు రూపొందించే పాలకుల కు డాక్టర్. ఆంజనేయ గౌడ్ గ్రంథం గొప్ప ఉపయోగకరంగా ఉంటుందన్నారు.1900 రూ:లు ధర గల ఈ పుస్తకం ఇప్పటికే రెండువేల కాపీ లు అమ్మడు పోయింది. త్వరలో తెలుగు అనువాదం కూడా వెలువడనుంది. నడిగడ్డ కు చెందిన డాక్టర్. ఆంజనేయ గౌడ్ పోరాటాలు,రాజకీయ లతో పాటు అధ్యయనం,పరిశోధన,రచనల లో కూడా ముందుండటం,పేద వర్గాల పై ద్రుష్టి పెట్టి జాతీయ స్థాయిలో మేధావుల మన్ననలు  పొందిన పుస్తకాన్ని వ్రాసిన ఆంజనేయులు అభినందనీయులు.
 

Related Posts