YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

జ్ఞానమార్గం

అమృతతత్వము గల పరమాత్మ 

Highlights

  • తేనెటీగ-ఆధ్యాత్మిక భావన
  • తేనె తుట్టె లోపల  తియ్యని తేనె
అమృతతత్వము గల పరమాత్మ 

 తేనె తుట్టె లోపల  తియ్యని తేనె ఉంది, ఆ తేనె మనకు తేలిక గా దొరకదు. కొన్ని వందల  తేనెటీగలు అవరోధము కల్పిస్తూ ఉంటాయి. ఆ తేనె అంది పుచ్చుకోవలెనంటే, పైన చుట్టుకొని యున్న తేనెటీగలను, తేనెపట్టు నుండి తరిమి వేసి , తేనె  చుక్కలను జాగ్రత్తగా ఒడిసి పట్టవలెను.


ఆధ్యాత్మిక భావము: మానవుడు అనే తేనెపట్టు యందు అమృతతత్వము గల పరమాత్మ (తేనె)  నిక్షిప్తమై ఉంటాడు. కానీ ఆ పరమాత్మ తత్వమును అర్థము చేసుకొనుట గానీ అవగాహన చేసుకొని పరమ పదము చేరుట కానీ అంత తేలికైన విషయం కాదు. మనలోని (అరిషడ్వర్గములు) ఆరు దుర్గుణాలు అంటి పట్టుకుని ఉండి, ఆ ప్రయత్నాలను వమ్ము చేస్తూ ఉంటాయి. అవే తేనెటీగలు. మనసులో భగవంతుని యందు శ్రద్ధ, విశ్వాసము, గట్టి నమ్మకము పూన్చుకొని,  కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములను తరిమి వేస్తే  గానీ, ఆ అమృత తత్వమును (పరమాత్మ) అందుకోలేము.

Related Posts