YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

విద్య-ఉపాధి

ఎంసెట్-2018 షెడ్యూల్ విడుదల

Highlights

  • తొలిసారిగా ఆన్ లైన్  ఎంసెట్
  •  మే 2 నుంచి 7 వరకు పరీక్షలు 
  • మార్చి 4 నుంచి దరఖాస్తులు
ఎంసెట్-2018 షెడ్యూల్ విడుదల

 ఎంసెట్ - 2018 షెడ్యూల్ను ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేపు ఎంసెట్ నోటిఫికేషన్ను విడుదల చేస్తామని తెలిపారు. మే నెల 2, 3 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా కోర్సులకు, మే 4, 5, 7 తేదీల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు. మే 6న దేశవ్యాప్తంగా నీట్ కారణంగా సెలవు ప్రకటిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. తొలిసారిగా ఆన్లైన్లో మూడు భాషల్లో ఎంసెట్ నిర్వహణ ఉంటుందన్నారు. మార్చి 4 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు అని సూచించారు.రూ. 10 వేల అపరాధ రుసుముతో ఏప్రిల్ 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 20 నుంచి మే 1 వరకు సంబంధిత వెబ్సైట్లో హాల్టికెట్లు అందుబాటులో ఉంటాయి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుం రూ. 400, ఇతరులకు రూ. 800లుగా నిర్ణయించారు. పరీక్ష పూర్తయిన పది రోజుల్లో ఫలితాలు వెల్లడి కానున్నాయి.

Related Posts