YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

విదేశీయం

నాగాలాండ్‌లో బాంబు పేలుడు 

Highlights

  • తెల్లవారుజామున క్రూడ్ బాంబు అమర్చినట్లు సమాచారం
  • గెలుపు తధ్యమన్న  నాగాలాండ్ సీఎం
  • మార్చి 3న ఎన్నికల ఫలితాలు
నాగాలాండ్‌లో బాంబు పేలుడు 

నాగాలాండ్ రాష్ట్రంలోని మాన్ జిల్లా, తిజిత్ ప్రాంతంలో ఉన్న పోలింగ్ స్టేషన్‌లో మంగళవారం ఉదయం బాంబు పేలుడు సంభవించింది. మంగళవారం ఉదయం  మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాలకు  ఎన్నికల పోలింగ్ మొదలైంది.  ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని ఓ గ్రామ కౌన్సిల్ మెంబర్‌గా గుర్తించారు. సుమారు ఉదయం 5.45 గంటల ప్రాంతంలో ఓ క్రూడ్ బాంబును పోలింగ్ స్టేషన్ వద్ద అమర్చినట్లు సమాచారం.  కాగా మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాలకు ఉదయమే  ఎన్నికల పోలింగ్ మొదలైంది.


నాగాలాంగ్‌ రాష్ట్రంలో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలున్నాయి. అయితే ఓ స్థానంలో ఎన్నిక నిలిచిపోవడంతో 59 స్థానాలకు మాత్రమే పోలింగ్ జరుగుతోంది. ఓటింగ్ ఉదయం 7 గంటలకు మొదలయింది. సాయంత్రం 4 గంటలకు ముగుస్తుంది. ఇక్కడ మొత్తం 2156 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కాగా మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాలకు ఉదయమే  ఎన్నికల పోలింగ్ మొదలైంది. 


నాగాలాండ్ సీఎం టీఆర్ జెలియాంగ్ తమ పార్టీ సంపూర్ణ మెజార్టీని సాధిస్తుందనే విశ్వాసాన్ని ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. ఇక మేఘాలయలోనూ 60 అసెంబ్లీ స్థానాలుండగా ఓ స్థానంలో ఓటింగ్ నిలిచిపోగా 59 స్థానాలకే పోలింగ్ జరుగుతోంది. 
షిల్లాంగ్‌లోని ఎంటీడీసీ ఆఫీస్ నార్త్ వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో మేఘాలయ రాష్ట్ర గవర్నరు గంగా ప్రసాద్ ఓటు హక్కును వినియోగించుకున్నారు.


త్రిపురతో పాటు ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను మార్చి 3న ప్రకటిస్తారు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్, లెఫ్ట్ ఫ్రంట్‌లతో బీజేపీ పోటీ పడుతోంది.
 

Related Posts