YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

సాహిత్యం

నేనెందు వోయే తానెందు వోయే

Highlights

  • శుభోదయం...
  • రాగం: కాంభోజి
  • స్వరకర్త: బాలాంత్రపు రజనీకాంతరావు
  • పాడినవారు: పి.ఎస్.రంనాథ్  & వి.ఎ.శ్రీలక్ష్మి
నేనెందు వోయే తానెందు వోయే

నేనెందు వోయె తానెందు వోయె
రానీలే రానీలే రానీలే 
మీనైన నాటి తన మిడుకెల్ల దిగవలె 
కానీలే కానీలే కానీలే॥

తలచూపేనాటి తలపెల్ల దిగవలె
తలచనీ తలచనీ తలచనీవే
కిరియైన నాటి తన కిటుకెల్ల దిగవలె
తిరుగనీ తిరుగనీ తిరుగనీవే

హరియైననాటి అదటెల్ల దిగవలె
జరగనీ జరగనీ జరగనీవే
వడుగైన నాటి తన వస విడువంగవలె
తడవనీ తడవనీ తడవనీవే

కలుషించే నాటి కడమెల్ల దిగవలె
అలుగనీ అలుగనీ అలుగనీవే
సతి బాసేనాటి చలమెల్ల దిగవలె
తతిగానీ తతిగానీ తతిగానీవే

ముసలైన నాటి ముసుపెల్ల దిగవలె
విసుగనీ విసుగనీ విసుగనీవే
మానైననాటి తన మదమెల్ల దిగవలె
పోనీవే పోనీవే పోనీవే

కలికైన నాటి గజరెల్ల దిగవలె
చెలగనీ చెలగనీ చెలగనీవే
వేడుకతో  నాటి వేంకటాపతి నన్ను
కూడనీ కూడనీ కూడనీవే

    - తాళ్ళపాక అన్నమాచార్యులు

 

Related Posts