YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

విదేశీయం

ఈజిప్ట్ పోలీసులు వండర్.. 

Highlights

  • మూడో అంతస్తు బాల్కనీ నుంచి వేలాడుతోన్న పిల్లాడు
  • గమనించిన కాపాడిన  పోలీసులు
  • దృశ్యాలు అక్క‌డి సీసీ కెమెరాలో రికార్డు
  • ఈజిప్టులోని అస్యుట్ నగరంలో ఘటన
ఈజిప్ట్ పోలీసులు వండర్.. 

ఈజిప్టులోని ఓ అపార్ట్ మెంటులోని మూడో అంతస్తు నుంచి ప‌డిపోయిన ఓ చిన్నారిని పోలీసులు క్యాచ్ ప‌ట్టుకుని ర‌క్షించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్క‌డి సీసీ కెమెరాలో రికార్డ‌య్యాయి.  అస్యుట్ నగరంలో ఇటీవల ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. మూడో అంత‌స్తు బాల్క‌నీలో ఓ పిల్లాడు వేలాడుతున్న‌ట్లు అక్క‌డే ఉన్న కొంద‌రు పోలీసులు గుర్తించారు.
ఓ పోలీసు మూడో అంత‌స్తు ఎక్కి ఆ పిల్లాడిని ర‌క్షించ‌డానికి ప‌రుగెత్తాడు. ఆ బిల్డింగు కింద ఉన్న మిగ‌తా పోలీసులు అ పిల్లాడు ప‌డిపోతే క్యాచ్ ప‌ట్టుకోవాలని చూస్తున్నారు. అంతలోనే ఒక్క‌సారిగా ఆ చిన్నారి  జారిప‌డిపోయాడు. చివ‌ర‌కు ఓ పోలీసు ఆ పిల్లాడికి ఎటువంటి గాయాలు త‌గ‌ల‌కుండా క్యాచ్ ప‌ట్టాడు. 

Related Posts