YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

జ్ఞానమార్గం

శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతీ స్వామి సిద్ధిపొందడం - వేదన

శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతీ స్వామి సిద్ధిపొందడం - వేదన

ॐ  శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతీ స్వామి సిద్ధిపొందడం - వేదన 

  కాంచీపుర పీఠ జగద్గురు శంకరాచార్య శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతి స్వామి సిద్ధి పొందియున్నారని వార్త  దిగ్భ్రాంతికి గురిచేసింది. 
1. జగద్గురు ఆది శంకరాచార్య స్థాపించి, స్వయంగా వారే ఆధిపత్యం వహించిన కంచి పీఠం ఎంతో విశిష్టత కలిగి ఉంది. 
2. ఆ పరంపరలో మనం అందరినీ తరించేసిన పరమాచార్య శ్రీశ్రీశ్రీ చన్ద్రశేఖరేన్ద్ర సరస్వతీ స్వామి  వారు సాక్షాత్తూ భూమిపైకి దిగివచ్చిన శంకరులుగా అందరికీ సువిదితమే. వారు త్రికాలజ్ఞులు. 
3. వారిచేత సంకల్పింపబడి, వారి వారసులుగా శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతీ స్వామి ఆ కంచిమఠ ప్రాధాన్యాన్ని నిలబెడుతూ మనందఱికీ మార్గదర్శకులయ్యారు. 
      మాయలోనున్న ప్రకృతిలో కలిప్రభావంతో వచ్చే అపవాదులవంటివి సహనంతో తట్టుకొని, దైవశక్తితో నిష్కలంకులై, ధర్మప్రభోదానికి ప్రత్యక్ష సాక్షులు వారే! 
4. వారు సిద్ధిపొంది, భైౌతిక కాయాన్ని విడిచినా, ఆ దైవశక్తి పరంపరగా కొనసాగుతుంది. 
5. ఆదిశంకరులు మనకందించిన ధర్మాచరణ విధానం, అద్వైత మత ఆచరణ - ఆ కంచి పీఠం ద్వారా, శ్రీశ్రీశ్రీ విజయేంద్ర ఇందిరా సరస్వతీ మార్గదర్శనంలో మనం పనిచేస్తాము. 
     భారతదేశ ఔన్నత్యాన్ని ఎప్పటికీ నిలబెడదాం. 

శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతీ స్వామి మన మధ్యలో భౌతికంగా  లేకపోయినా, పరంపరాగత శక్తి మనకి మార్గదర్శనం చేస్తూ ఉంటుంది.

పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్పూర్ణ ముదచ్చతే I 
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాఽవశిష్యతే॥ 
  -  అనంతానికి ఎంత కలసినా అనంతమే! 
      అనంతంలో నుంచీ ఎంత తీసేసినా అనంతమే! 
  
    ॐ శాంతిశ్శాంతిశ్శాంతిః

Related Posts