YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

అంజలి… ఇలా అయిపోయిందేంటి..!

అంజలి… ఇలా అయిపోయిందేంటి..!

అభిమాన తారాగణం అంతా తమ తమ అభిమానులకు సంక్రాంతి పండగ శుభాకాంక్షలు తెలిపారు. కొందరు మాటల్లో చెప్తే, మరికొందరు వీడియోలు రూపొందించి చెప్పారు. అలాగే ఇంకొందరు అయితే తమ ఫోటోలను పోస్ట్ చేస్తూ… తమ భావాలను పంచుకున్నారు. అందులో తెలుగు బ్యూటీ అంజలి పోస్ట్ చేసిన ఫోటో నెటిజన్లకు షాక్ ఇస్తోంది. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే…. ఈ బ్యూటీ అంజలియేనా? అనిపించే విధంగా మారిపోయింది. నెటిజన్లు అంజలిని చివరిసారిగా ‘బెలూన్’ సినిమా ప్రచార సమయంలో వీక్షించారు. అప్పటికి అంజలి బొద్దుగా, ముద్దుముద్దుగా కాస్త చబ్బీగానే కనిపించింది. అయితే తాజాగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఎరుపు రంగు చీర కట్టుకుని ఉన్న ఓ పిక్ ను పోస్ట్ చేసి, అవాక్కయ్యేలా చేసింది. బొద్దుగుమ్మ కాస్త చూడచక్కగా స్లిమ్ బ్యూటీగా జీరో సైజులోకి మారిపోయింది. అయితే తన శరీరాకృతిని తగ్గించిన అంజలి, ముఖవర్చస్సులో మాత్రం అంతకుమించిన గ్లోరీని ప్రదర్శిస్తోంది. బహుశా ఏమైనా “తీపికబురు” చెప్పే ఆనందంలో అంజలి ఈ విధంగా మారిందో లేక తదుపరి స్క్రిప్ట్ నిమిత్తం ఈ స్థాయిలో తగ్గిందో గానీ, అంజలిని అభిమానించే ప్రేక్షకులకు మాత్రం ఈ ఫోటో ‘బూస్ట్’ ఇస్తుందనే చెప్పొచ్చు. అందుకే అంటారు…. చక్కనమ్మ చిక్కినా అందమే అని..! ఈ తగ్గుదల అయినా తెలుగులో మరిన్ని చిత్రాలు రావడానికి బాటలు వేస్తుందేమో చూడాలి. తెలుగు బ్యూటీ అయిన అంజలి ప్రస్తుతం ఎక్కువగా తమిళ సినిమాలు చేస్తున్న విషయం తెలిసింద

Related Posts