YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

హైదరాబాద్ నగరంలో విష జ్వరాలు

హైదరాబాద్ నగరంలో విష జ్వరాలు

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

వర్షాకాలం రావడంతో హైదరాబాద్ నగరంలో విష జ్వరాలు జనాలను హడలెత్తిస్తున్నాయి. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా వ్యాధులతో హాస్పిటల్స్ లో రోగులు రోజురోజుకు ఎక్కువైపోతున్నారు. అనేక ఏరియాల్లో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వ్యాధులు జనాలను పట్టి పీడిస్తున్నాయి.సాధారణంగా రోజుకి OPలో వెయ్యి కేసులు వరకు వస్తుంటాయి. అయితే ఇప్పుడు మాత్రం ఒక్కసారిగా 3000 వరకు OPలో రోగులు వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఉస్మానియా ఆస్పత్రిలో సాధారణంగా వెయ్యికి పైగా కేసులు నమోదైతే ఒక్క రోజుకి మూడు వేల వరకు రోగులు కిక్కిరిసి పోతున్న పరిస్థితి. అందులో కూడా ఆస్పత్రిలో అడ్మిట్ అయిన రోగుల సంఖ్య 60 వరకు ఉంటుందని  డాక్టర్లు వెల్లడించారు. మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ కేసులు ప్రైవేటు ఆస్పత్రుల కంటే ప్రభుత్వ ఆసుపత్రులలోనే ఎక్కువగా నమోదు అవుతున్నాయి.హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో జ్వరాలతో చేరుతున్న రోగుల సంఖ్య పెరుగినట్లు అ    క్కడి డాక్టర్లు కూడా చెబుతున్నారు. వర్షాకాలం దోమలు ఎక్కువగా ఉంటాయని, కాచిన నీళ్లు తాగడం.. తగిన జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం అని డాక్టర్లు చెబుతున్నారు. డెంగ్యూ రాకుండా ఉండాాలంటే పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు జీహెచ్ఎంసీ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Related Posts