YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన జనసేన ఎమ్మెల్యే.

పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన జనసేన ఎమ్మెల్యే.

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మంగళవారం రాజోలు పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. రాజోలు నియోజకర్గం మలికిపురం పోలీస్ స్టేషన్పై దాడి కేసులో రాపాకతో పాటు ఆయన అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆదివారం సాయంత్రం కలిగితి కుమార్ గెస్ట్హౌస్లో పేకాడుతున్న తొమ్మిది మందిని మలికిపురం ఎస్సై కేవీ రామారావు అదుపులోకి తీసుకోవడంపై రాపాక అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి విదితమే. అంతటితో అగకుండా రాపాక తన అనుచరులతో కలిసి పోలీస్ స్షేషన్పై దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో రాపాక ఏ1గా ఉన్నారు.
మరోవైపు జనసేన కార్యకర్తల దాడిలో ధ్వంసమైన మలికిపురం పోలీస్స్టేషన్ను ఏలూరు రేంజ్ డీఐజీ ఏఎస్ ఖాన్ పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒక ఎమ్మెల్యే బాధ్యతా రహితంగా వ్యవహరించడం సమాజానికి మంచిది కాదన్నారు. ఇలాంటి తొందరపాటు చర్యల వల్ల యువతకు పోలీస్ వ్యవస్థను ఏమైనా చేయవచ్చనే తప్పుడు సంకేతాలు వెళ్తాయన్నారు. ఒకవేళ ఎస్ఐ తప్పు చేసి ఉంటే తగిన ఆధారాలతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే.. తప్పకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Related Posts