YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

విష జ్వరాలపై అప్రమత్తం అవసరం

విష జ్వరాలపై అప్రమత్తం అవసరం

విష జ్వరాలపై అప్రమత్తం అవసరం
సూర్యాపేట : వానలు కురిసి ఉష్ణోగ్రతలు తగ్గడంతో రాష్ట్ర వ్యాప్తంగా విష జ్వరాలు విజృంభిచడంతో ఇపుడు రాష్ట్రమంతా వణుకుతోంది. రాష్ట్రంలోని పలు నగరాలు , పట్టణాలు డెంగీ , మలేరియా లాంటి విషజ్వరాలతో తల్లడిల్లుతున్న నేపథ్యంలో ఆసుపత్రులన్ని జ్వరపీడితులతో కిటకిటలాడుతున్నాయి. జిల్లాలో విష జ్వరాల కేసులు అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వైద్య , ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించి రోగుల ఆరోగ్య విషయాలు డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అధికారులను రోగులకు సరైన సౌకర్యాలు కల్పించి, సకాలంలో వైద్యం అందేటట్లు చూడాలని డాక్టర్లకు సూచించారు. జిల్లా వైద్య , ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఈటెల మాట్లాడుతూ రాష్ట్రంలో విష జ్వరాల వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. అనవసరంగా ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి ఆర్థికంగా నష్టపోవద్దు. ఇక్కడీ డాక్టర్లంతా అనుభవజ్ఞులు. వారి సేవలు వినియోగించుకోవాలన్నారు. డాక్టర్లంతా కేసుల తీవ్రతను బట్టి సకాలంలో అందరు అందుబాటులో ఉండి సకాలంలో సరైన వైద్యం అందించాలన్నారు. ప్రజల ఆరోగ్యం ప్రభుత్వం భాద్యత . ఈవిషయంలో ఎవరు నిర్లక్ష్యం వహించినా క్షమించే ప్రసక్తే లేదన్నారు .  అలాగే సూర్యాపేటకు మెడికల్ కళాశాల రావడం గొప్ప వరం. మెదటి సంవత్సరం విద్యార్దులకు ఈటెల శుభాకాంక్షలు తెలిపారు.విద్యార్ధులందరు ఈ అవకాశాన్ని సద్వినియోగo చేసుకోవాలని కోరారు. అందరు కష్టపడి చదవాలన్నారు. వైద్య వృత్తి చాలా గొప్పదన్నారు. దేవుడి తర్వాత గొప్ప కీర్తించేవారు డాక్టర్లు కాబట్టి ఈ వృత్తిని దైవంగా భావించి సమాజానికి సేవలందించాలన్నారు. మీరు గొప్పగా ఎదగాలని, మీకు, మీకుటుంబ సభులకు, సమాజానికి మంచి పేరు తేవాలని ఆకాక్షించారు .  ఈ కార్యక్రమానికి పంచాయత్ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, కోదాడ శాసన సభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్, జెడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపీకా, జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ , జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు, జిల్లా వైద్యాధికారి నిరంజన్, వైద్యకళాశాల సిబ్బంది,,విద్యార్ధులు పాల్గోన్నారు.

Related Posts