YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆటలు ఆరోగ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

క్రీడలను ప్రారంభించిన మంత్రులు

క్రీడలను ప్రారంభించిన మంత్రులు

క్రీడలను ప్రారంభించిన మంత్రులు
విజయనగరం సెప్టెంబర్ 14,
విజయనగరం వేదికగా రాష్ట్ర క్రీడాపాధికార సంస్థ ఆధ్వ ర్యంలో మూడు రోజులపాటు జరిగే రాష్ట్ర స్థాయి సి.ఎం. కప్ ఖోఖో పోటీలు స్థానిక రాజీవ్ క్రీడా ప్రాంగణంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి, మంత్రులు బొత్స సత్యనారాయణ, ముత్తంశెట్టి శ్రీనివాసరావులు క్రీడలను లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల నుండి బాలురు, బాలికల విభాగంలో జట్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నా యి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి 450 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. తొలి పోటీ విజయనగరం, చిత్తూరు మధ్య జరిగింది.ఈ సందర్భంగా జరిగిన ప్రారంభోత్సవ వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి, క్రీడల పతాకాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ, శాప్ పతాకాన్ని అవంతి శ్రీనివాసరావు ఆవిష్కరించారు. జిల్లాకుచెందిన ప్రముఖ క్రీడాకారుడు భగవాన్ దాస్ చిత్రపటానికి మంత్రులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పదమూడు జిల్లాల క్రీడాకారుల నుండి గౌరవ వందనాన్ని మంత్రులు స్వీకరించారు.  
ఈ సందర్భంగా జరిగిన ప్రారంభ వేడుకల్లో మంత్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ స్థానిక రాజీవ్ స్టేడియంలో మరిన్ని వసతులు కల్పించి అభివృద్ధి చేస్తామన్నారు. ఈ జిల్లాకు కబడ్డీ అకాడమీ  మంజూరుకు చర్యలు చేపడతామని, జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు ఇక్కడ జరిగేలా ప్రయత్నిస్తామన్నారు. విద్యార్ధుల చదువుపైనే దృష్టిసారించి వ్యాయామంపై నిర్లక్ష్యం వహించడం వల్ల వారిలో శారీరక, మానసిక ధృడత్వం లోపిస్తున్నదని మంత్రి పేర్కొన్నారు. చిన్నపాటి సమస్యలను కూడా తట్టుకొనే శక్తి లేక వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. విద్యార్ధులు శారీరకంగా, మానసికంగా ధృడంగా వుండాలంటే, వారిలో మానసిక స్థైర్యం పెంపొందించాలంటే వారికి వ్యాయామం, క్రీడలు అవసరమనే విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించాల్సి వుందన్నారు. రాష్ట్రంలోని విద్యార్దుల్లో క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుంద న్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి స్వతహాగా క్రీడాకారులు కావడంవల్ల మన రాష్ట్రంలో క్రీడలకు ప్రోత్సాహం లభిస్తోందన్నారు. క్రీడల ద్వారా దేశభక్తి పెంపొందుతుందన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమశాఖ మంత్రి పుష్పశ్రీవాణి మాట్లాడుతూ రాష్ట్రంలోని క్రీడాకారులంతా బాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.సింధును ఆదర్శంగా తీసుకోవాలన్నారు. వరుసగా నాలుగుసార్లు ఓటమి పాలైనా ఐదోసారి ప్రయత్నించి ప్రపంచ బాడ్మింటన్ షిప్లో విజయం సాధించిన విషయాన్ని గుర్తుచేస్తూ, ఓటమికి నిరుత్సాహం చెందక గెలుపు సాధించేవరకూ ప్రయత్నం చేయాల్సి వుందన్నారు. రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించే ముఖ్యమంత్రి వున్నారని, రాష్ట్రంలో జాతీయ స్థాయిలో పతాకాలు సాధిచిన వారికి కూడా నగదు ప్రోత్సహాకాలను ప్రభుత్వం ప్రకటించిందని,
వీటిని వినియోగించుకొని క్రీడాకారులంతా మంచి ఫలితాలు సాధించాలని కోరారు. పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ నగరంలోని క్రీడాకారులకు రాజీవ్ స్టేడియం గొప్ప వరమని దీనిని వినియోగించుకొని మంచి విజయాలు సాధించాలని కోరారు. ఈ స్టేడియంలో మరిన్ని వసతులు కల్పించే దిశగా ప్రయత్నాలు చేస్తామన్నారు. నగరంలో ప్రహారీగోడలు వున్న అన్ని పార్కుల్లోనూ ఆటస్థలాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడతామన్నారు. 
విద్యార్ధులు ఉత్సాహంగా వుండాలంటే వారికి వ్యాయామం, క్రీడలు అవసరమన్నారు.

Related Posts