YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

ఇండియన్ ఆయిల్ కొత్త ఆలోచన... ఇకపై పెట్రోల్, డీజిల్ డోర్ డెలివరీ...?

ఇండియన్ ఆయిల్ కొత్త ఆలోచన... ఇకపై పెట్రోల్, డీజిల్ డోర్ డెలివరీ...?

చమురు దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మరో కొత్త సేవను ప్రారంభించింది ప్రారంభించబోతుంది. ఇంటి వద్దే ఇంధనాన్ని అందించే అవకాశాన్ని ప్రారంభించినట్టు తన అధికారిక ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ఇకపై పెట్రోలు, డీజిల్ ను ఇంటి వద్దే అందిస్తామని తెలిపింది. పెట్రోలు బంకులకు దూరంగా ఉండే ప్రాంతాలతో పాటు గ్రామాలకు ఈ నూతన సేవలు ఉపయోగకరంగా ఉంటాయని తెలిపింది. కాగా ఇంటివద్దే అందించే పెట్రో ఉత్పత్తులపై మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. సాధారణ ధరకే పెట్రోల్ ఇస్తారా? సేవా చార్జీలు వసూలు చేస్తారా? డెలివరీ చార్జ్ ఎంతుంటుంది? ఎప్పటి నుంచి ఈ సేవలు మొదలవుతుంది? తదితర విషయాలపై ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ స్పష్టత ఇవ్వాల్సి వుంది.

Related Posts