YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

 మంత్రులు, ఎమ్మెల్యేలతో మత విశ్వాసాలు దెబ్బతినే విధంగా మాట్లాడిస్తున్న సీఎం 

 మంత్రులు, ఎమ్మెల్యేలతో మత విశ్వాసాలు దెబ్బతినే విధంగా మాట్లాడిస్తున్న సీఎం 

 మంత్రులు, ఎమ్మెల్యేలతో మత విశ్వాసాలు దెబ్బతినే విధంగా మాట్లాడిస్తున్న సీఎం 
తిరుమలలో అన్యమత ప్రచారం ఆపాల్సిన బాధ్యత మీ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డికి లేదా 
 - మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు
విజయవాడ నవంబర్ 21 
ఆటోనగర్ లోని పార్టీ కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ  ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మీరు మంత్రులు, ఎమ్మెల్యేలతో   మత విశ్వాసాలను దెబ్బతీసేవిధంగా మాట్లాడిస్తున్నారు, ఎంతో మంది హైందవుల విశ్వాసం దెబ్బతీసే విధంగా  మాల ధారణలో ఉండి మమ్మల్ని తిట్టించడానికి నీచమైన భాష వాడుతున్నారు, ఇలా నోరేసుకుని పడితేనే మీ అపాయింట్మెంట్లు దక్కుతున్నాయి, సిమెంట్ కంపెనీలతో కుమ్మక్కై ధరలు పెంచేసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. మద్యం బార్లు, కంపెనీలతో కూడా చీకటి ఒప్పందాలు చేసుకున్నారని, ఇసుక విషయంలో మీ మంత్రులు, ఎమ్మెల్యేలు, వాళ్ల బంధువుల, అనుచరుల 68 పేర్లిస్తే ముఖ్యమంత్రి జగన్ వాళ్ల మీద చర్యలు తీసుకున్నారా? ఎందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇసుక బకాసురులు, ఇసుకాసురుల మీద సీఎం జగన్మోహన్రెడ్డి చర్యలు తీసుకోలేకపోతున్నారు. 
పోలవరం ప్రాజెక్టుపై నిన్న మాట్లాడితే అసలు పోలవరం ప్రాజెక్టే చూడని ఎమ్మెల్యే నన్ను తిడుతున్నాడు, ఏం తెలుసయ్యా నీకు? వర్షాలు పడటం లేదని కాంక్రీట్ వెయ్యటం లేదట, అబ్బా ఈ 6 నెలల్లో చాలా  తెలుసుకున్నారని ఎద్దేవా చేశారు. రివర్సు టెండరింగ్ పేరుతో రిజర్వు టెండరింగ్ చేసి పోలవరం ప్రాజెక్టును కోర్టులో పెట్టారు,   కొబ్బరికాయ కొట్టిన సంబంధిత మంత్రి పత్తా లేడు, ముఖ్యమంత్రి సమాధానం చెప్పడు, పోలవరం తెలుగు ప్రజల గుండెకాయ, ప్రాజెక్టుని దె బ్బతీయడంతో 28వేల కుటుంబాలు రోడ్డునపడ్డాయి, గిన్నిస్ బుక్లో ఎక్కిన కంపెనీకి బిల్లులు ఆపేసి కాంట్రాక్టర్లను కంపెనీ మీద ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దాయిచేయిస్తున్నారు,   మీ మొహం మాకు నచ్చలా అని బందరు పోర్టు, పోలవరం పవర్ ప్రాజెక్టు, పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులను రద్దు చేశారు, కృష్ణపట్నంలో వాటాల సంగతేమిటి.. చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్రెడ్డి గార్ల దగ్గర రెండు దశాబ్దాలు పనిచేసిన నవయుగ కంపెనీ, ఇవాళ కృష్ణపట్నం పోర్టు బయట రాష్ట్రాల చేతుల్లోకి వెళ్లిపోతోంది. ముఖం నచ్చకపోయిన, అడిగిన మామూళ్లు ఇవ్వకపోయినా కాంట్రాక్టు రద్దు చేస్తున్నారు.రాష్ట్రంలో పరిశ్రమలను వెళ్లగొట్టినందుకు మీ తప్పులను ప్రశ్నిస్తే ఇవాళ అయ్యప్ప మాల ధరించిన వారితో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి  పరుష పదజాలంతో మమ్మల్ని తిట్టిస్తున్నారు, 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలున్నా  సీఎం అభద్రతా భావంతో బతుకుతున్నారు, అసహనంతో ఏం మాట్లాడిస్తాన్నారో, ఏం మాట్లాడుతున్నారో సోయ లేకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు,  భయపడేది లేదు, ప్రజాస్వామ్యంలో ఇవన్నీ తట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు, తిరుమల తిరుపతి దేవస్థానం.. అందరికీ ఇలవేల్పు, కొలుదైవం కోట్లాది మంది భక్తుల విశ్వాసం సంబంధించి టీటీడీపై బాధ్యతగల మంత్రి మీ కొడాలి నాని గుడి గురించి, మత విశ్వాసాల గురించి, సంప్రదాయాలను తూలనాడుతూ అతను మాట్లాడే మాటలకు జగన్మోహన్రెడ్డి గారు ఎందుకు నోరు తెరవలా? ఎందుకు ఆ భాషను సమర్ధిస్తున్నారు? మా సంప్రదాయాల్ని ఎందుకు దెబ్బతీయాలని ముఖ్యమంత్రి గారు ప్రయత్నిస్తున్నారు, అన్యమత ప్రచారం ఆపాల్సిన బాధ్యత మీ బాబాయ్ టీటీడీ చైర్మన్ అయిన వైవీ సుబ్బారెడ్డికి బాధ్యత లేదా, స్వర్ణ కాటేజీలో కూడా రాజకీయాలు చేస్తున్నారు, స్వామి వారి అన్న ప్రసాదంతో పార్టీలు చేస్తారా, తిరుమల వంటి పుణ్య పవిత్ర ప్రదేశాన్ని పంచాయితీలకు అడ్డాగా మార్చారని విమర్శించారు. 
మైలవరం నియోజకవర్గంలో నోట్లను చించి, స్లిప్పులు ఇచ్చింది వైసీపీ నేతలే, ఎన్నికల సమయంలో కరెన్సీ నోట్లను చించి పంచే అధికారం ఎవరిచ్చారు? ఈ విషయం సోషల్ మీడియాలో కూడా వచ్చింది, స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అనుచరులే ఈ దుర్మార్గానికి పాల్పడ్డారు ముఖ్యమంత్రి, పోలీసులు స్పందించి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయ్యప్ప మాలలో ఉన్న ఎమ్మెల్యే వివరణ ఇవ్వాలి, ఎన్నికల సంఘం, కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారించాలి, ఇలాంటి బయట పెడుతున్న నన్ను తిట్టి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు, ఇటువంటి మాఫియా సంస్కృతిని ప్రోత్సహించే వారిని తరిమి కొట్టాలి, మీడియా ప్రచారం చేయకపోయినా సోషల్ మీడియా స్పందించింది, 2430 జీవో వల్ల కొన్ని మీడియా సంస్థలు జగన్  భయపడుతున్నాయి, కరెన్సీ నోట్లను ముక్కలు చేసిన విషయంపై ఆర్బీఐ కూడా స్పందించాలి, క్షేత్ర స్థాయిలో విచారిస్తే అందిరికీ వాస్తవాలు తెలుస్తాయన్నారు.

Related Posts