YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

అవినీతి నిరోధక శాఖకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మక్తల్ సబ్ రిజిస్టర్

అవినీతి నిరోధక శాఖకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మక్తల్ సబ్ రిజిస్టర్

పెట్రోల్ దాడులు జరుగుతున్నా పంథా మారని అధికారులు 
అవినీతి నిరోధక శాఖకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మక్తల్ సబ్ రిజిస్టర్
నారాయణపేట 
పెట్రోల్ దాడులు జరుగుతున్నా అవినీతి అధికారులు మాత్రం తమ పంథా మార్చుకోవడం లేదు. ప్రాణాలకన్నా అవినీతే ముఖ్యమనే రీతిలో ప్రవర్తిస్తున్నారు. పెద్ద పెద్ద జీతాలు తీసుకుంటూ కూడా అవినీతికి పాల్పడుతున్న ఇలాంటి అధికారులను ఏం చేయాలో అర్ధం కాని పరిస్థితి నెలకొని ఉంది. తాజాగా నారాయణపేట జిల్లా మక్తల్ సబ్ రిజిస్టర్ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. హైదరాబాద్ ఎల్ బి నగర్ కు చెందిన వెంకట్ రెడ్డి అనే వ్యకి మక్తల్ సమీపంలోని సంఘం బండ  వద్ద 18 ఎకరాల  భూమి కొన్నాడు. ఇదే భూమిని అన్నదమ్ములకు ఇద్దరి పేరిట సగం, సగం భూమి రిజిస్టేషన్   చేయమని అడగగా దానికి మక్తల్ సబ్ రిజిష్టర్ హాబీబ్ ఉద్దీన్ 75 లక్షలు డిమాండ్ చేశాడు. దీంతో వెంకట్ రెడ్డి ఏసీబీ ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ పథకం ప్రకారం సబ్ రిజిస్టర్ లో కార్యాలయంలో   సబ్ రిజిస్టర్  హాబీబ్ ఉద్దీన్ కు వెంకట్ రెడ్డి 75000 వేలు లంచం ఇస్తుండగా పట్టుకున్నారు. అతనితో పాటు అతనికి సహకరించిన ప్రయివేటు అటెండర్ ఆరిఫ్ ను కూడ అదుపులోకి తీసుకున్నారు.

Related Posts