YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే షీటీమ్‌కు ఫిర్యాదు చేయాలి

ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే షీటీమ్‌కు ఫిర్యాదు చేయాలి

ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే షీటీమ్‌కు ఫిర్యాదు చేయాలి
హైదరాబాద్ 
నగరంలోని పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రోడ్డుపై వెళుతున్న యువతులను వేధిస్తున్నాడని షీటీమ్‌కు డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న షీటీమ్ బృందం యువకుడిని రెడ్ హ్యాండెండ్‌గా పట్టుకుని పోలీసులకు అప్పగించారు.కళాశాలకు వెళ్లే విద్యార్థినిలు, యువతులు, మహిళలు వేధింపులకు గురికావాల్సిన అవసరం లేదని, ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే షీటీమ్‌కు ఫిర్యాదు చేయాలని, ఫిర్యాదు దారులు పోలీస్‌స్టేషన్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని తెలిపారు.ఫిర్యాదు చేసేందుకు దైర్యంగా ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.పోనీలే అనుకుంటే బలహీనతగా భావించి పోకిరీలు రెచ్చిపోయేందుకు అవకాశం ఇచ్చిన వారం అవుతామని హితవు పలికారు. నిందితుడికి అతడి తల్లిదండ్రుల ఎదుట కౌన్సెలింగ్ ఇచ్చిన అనంతరం కోర్టులో హాజరుపర్చడం జరుగుతుందని చెప్పారు.

Related Posts