YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

దోషం ఉందని దోచేశారు..

దోషం ఉందని దోచేశారు..

దోషం ఉందని దోచేశారు...
గుంటూరు, నవంబర్ 22
దోషం ఉందని మాయమాటలు చెప్పి అర్చకుడు ఆస్తిపాస్తులతో సహా సమస్తం దోచేసిన ఘటన వెలుగుచూసింది. అమ్మవారి పేరిట ఆస్తి రాస్తే దోషం పోతుందని చెప్పడంతో ఓ భక్తుడు తనకున్న పొలాన్ని రాసిచ్చేశాడు. అక్కడితో ఆగలేదు ఆ అర్చకుడు.. ఆ తరువాత నెమ్మదిగా నగదు.. భక్తి పేరుతో బంగారం వసూలు చేశాడు. చివరకి అదంతా తాను కొనుక్కున్నానని అర్చకుడు ట్విస్ట్ ఇవ్వడంతో అవాక్కవడం ఆ భక్తుడి వంతైంది. మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.భక్తి పేరుతో ఓ వ్యక్తిని అర్చకుడు బురిడీ కొట్టించిన ఘటనపై గుంటూరు జిల్లా ముప్పాళ్ల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. మండలంలోని ఇరుకుపాలెం నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారి ఆలయ పూజారి వేణుగోపాలరావు మాయమాటలతో ఘరానా మోసానికి పాల్పడ్డాడు. జాతకంలో దోషం ఉందని చెప్పి నిత్యం ఆలయానికి వచ్చే భక్తుడు నర్రా శ్రీనివాసరావును భయపెట్టాడు. అమ్మవారి పేరిట ఆస్తి రాస్తే దోషం పోతుందని.. తరువాత తీసుకోవచ్చని నమ్మబలికాడు.పూజారి మాయమాటలు నమ్మిన శ్రీనివాసరావు మూడు కోట్లు విలువ చేసే తన నాలుగెకరాల భూమిని ఆలయానికి రాసిచ్చేశాడు. అర్చకుడు వేణుగోపాలరావు సూచనల మేరకు ఆ భూమిని రిజిస్ట్రేషన్ కూడా చేయించాడు. అంతటితో ఆగని అర్చకుడు శ్రీనివాసరావు నుంచి పది లక్షల వరకూ నగదు.. 20 సవర్ల బంగారం కూడా వసూలు చేశాడు. అప్పటివరకూ నమ్మకంగా ఉన్న వేణుగోపాలరావు ఉన్నపళంగా ప్లేట్ ఫిరాయించేశాడు.ఆలయానికి భూమి రాసివ్వలేదని.. భూమిని తాను కొనుక్కున్నానని అర్చకుడు వేణుగోపాలరావు చెప్పడంతో భక్తుడు శ్రీనివాసరావు కంగుతిన్నాడు. తాను మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పూజారి వేణుగోపాలరావుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related Posts