Highlights
తురకపాలెంలో పోలీసుల తనిఖీలు
గుంటూరు నవంబర్ 25
గుంటూరు జిల్లా మాచవరం మండల తురకపాలెం లో పోలీసులు కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో 65 మంది పోలీసులు పాల్గోన్నారు. ఈ సందర్బంగా పత్రాలు లేని 25 ద్విచక్ర వాహనాలు, స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు రూరల్ ఎస్పీ విజయ రావు ఆదేశాలమేరకు సత్తెనపల్లి డిఎస్పీ విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీలో పలువురు సీఐ లు, ఎస్సైలు పాల్గో్నారు. డీఎస్పీ మాట్లాడుతూ గ్రామాల్లో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చూసేందుకు ఈకార్యక్రమమని అన్నారు. గుట్కా, సారాయి, గంజాయి , మరణా ఆయుధాలు కలిగి ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అయన హెచ్చరించారు.
