YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

జూలై 25 నుంచి రేషన్ కార్డుల పంపిణి.

జూలై 25 నుంచి రేషన్ కార్డుల పంపిణి.

జయశంకర్ భూపాలపల్లి,
జూలై 25 నుంచి ఆగస్టు 10 వరకు మండల కేంద్రాలలో రేషన్ కార్డుల పంపిణీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం రాత్రి వానాకాలం సాగు, భారీ వర్షాలు, సీజనల్ వ్యాధుల నియంత్రణ, రేషన్ కార్డుల పంపిణీ వంటి పలు అంశాల పై   సీఎం రేవంత్ రెడ్డి సచివాలయం నుండి
రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి, మంత్రి వర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ,పొన్నం ప్రభాకర్, దామోదర్ రాజనర్సింహ, వివేక్ వెంకటస్వామి , వాకాటి శ్రీహరి, సీతక్క, శ్రీధర్ బాబు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామ కృష్ణా రావు  అన్ని జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సమావేశంలో ఖమ్మం నుండి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ   గత ఏడాది ఖమ్మం జిల్లాలో మూడు గంటల వ్యవధిలో 39 సెంటీ మీటర్ల భారీ వర్షం పడిందని, ప్రస్తుతం కూడా అటువంటి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ లను ఆదేశించారు.  వర్షాల నేపథ్యంలో అంటువ్యాధులు ప్రబల కుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యవసాయ సాగు పనులు సజావుగా జరిగేందుకు అవసరమైన ఎరువులు విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంచడం, నీటిపారుదల శాఖ ద్వారా రైతులకు సాగునీరు విడుదల పై కలెక్టర్ దృష్టి సారించాలని అన్నారు.  జూలై 21 వరకు మన రాష్ట్రంలో దాదాపు 20 శాతం లోటు వర్షపాతం నమోదైందని, గత 3 రోజులు గా వర్షాలు ఎక్కువ కురుస్తున్నాయని, రాష్ట్ర వ్యాప్తంగా ఎస్.డి.ఆర్.ఎఫ్ బృందాలను అప్రమత్తం చేయాలని, జిహెచ్ఎంసి పరిధిలో హైదరా ఆధ్వర్యంలో 150 బృందాలను సిద్దం చేశామని అన్నారు. నగరంలో వర్షాలు ఉన్నప్పుడు ట్రాఫిక్ నియంత్రణకు ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో పిడుగు పాటుకు మరణాలు సంభవిస్తున్నాయని, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని వర్షాలు వచ్చినప్పుడు చెట్ల కింద స్తంభాల దగ్గర ఉండకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని  అన్నారు.  పిడుగు పాటుతో మరణించిన కుటుంబాలకు ప్రభుత్వం నుంచి సహాయం అందించాలని, దీనికోసం పోలీసు అధికారులు వెంటనే ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయాలని అన్నారు. వర్షాకాలంలో వచ్చే అంటూ రోగాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని ముఖ్యంగా ఐటీడీఏ గిరిజన ప్రాంతాల్లో అధిక శ్రద్ధ వహించాలని అన్నారు. నీటి నిల్వ లేకుండా చూడాలని, ఎక్కడైనా వర్షపు నీరు నిల్వ ఉంటే అక్కడ ఆయిల్ బాల్స్ వంటివి స్థానిక సంస్థల ద్వారా వేయాలని అన్నారు. డ్రైయినేజీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి జిల్లా ఆస్పత్రి వరకు వైద్యులు సిబ్బంది సకాలంలో విధులకు హాజరయ్యేలా చూడాలని , ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరును కలెక్టర్లు పర్యవేక్షించాలని అన్నారు.  జిల్లా పరిధిలో ఉన్న ఐఏఎస్ అధికారులు క్షేత్రస్థాయి తనిఖీలు అధికంగా నిర్వహించాలని, ఆసుపత్రులను ఆకస్మిక తనిఖీ చేసి పనితీరు పర్యవేక్షించాలని అన్నారు. అత్యవసర సమయంలో కలెక్టర్లు ఖర్చు చేసేందుకు నిధులు కూడా అందుబాటులో పెట్టడం జరుగుతుందని అన్నారు.
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మన ప్రాజెక్టులలో నీరు నిల్వ చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.  
గత సంవత్సరం మన రాష్ట్రంలో దేశంలోనే అత్యధికంగా రెండు కోట్ల 85 లక్షల మెట్రిక్ టన్నుల వారి ఉత్పత్తి చేశామని అన్నారు. గోదావరి బేసిన్ లో ప్రాజెక్టులలో నీరు తక్కువగా ఉందని, ఇక్కడ నీరు వృధాగా పోకుండా ప్రాజెక్టులలో ఎప్పటికప్పుడు నింపాలని అన్నారు.  వ్యవసాయ శాఖ అధికారులు నీటిపారుదల శాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలని అన్నారు.  రైతులకు అవసరమైన విత్తనాలు, యూరియా అందుబాటులో ఉండాలని అన్నారు.  విత్తనాల, ఎరువులు అక్రమ స్టాక్ ఉంటే కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. నకిలి విత్తనాల అమ్మే వారి పై పీడీ యాక్ట్ నమోదు చేయాలని అన్నారు.
ప్రతి జిల్లాలో ఎరువుల స్టాక్ ఎంత అందుబాటులో ఉందో కలెక్టర్  రెగ్యులర్ గా ప్రకటనలు విడుదల చేయాలని, ప్రతి ఎరువుల షాప్ వద్ద స్టాక్ వివరాలు నోటీసు బోర్డులు పెట్టాలని, ఇద్దరూ  పోలీస్ అధికారులను నియంత్రణకు పెట్టాలని అన్నారు. ఎరువుల లభ్యత పై అసత్య ప్రచారాలను గట్టిగా తిప్పి కొట్టాలని సీఎం పేర్కోన్నారు. రైతులకు సకాలంలో అవసరమైన ఎరువులు అందుబాటులో ఉంచాలని, రైతులు ముందస్తుగా ఎరువుల స్టాక్ పెట్టుకోకుండా అవగాహన కలిగించాలని అన్నారు. 20 నుంచి 25 శాతం ఎరువులు వ్యవసాయ అవసరాల కోసం కాకుండా ఇతర అంశాలకు, డీజిల్ వాహనాలలో పొగ తగ్గించేందుకు సబ్సిడీ ఎరువులు వినియోగిస్తున్నట్లు కేంద్ర మంత్రి జేపీ నడ్డా తెలిపారని సీఎం అన్నారు.  రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు అప్రమత్తంగా ఉంటూ సబ్సిడీ ఎరువులు దారి మళ్ళించకుండా చూడాలని అన్నారు.
వ్యవసాయ అవసరాలకు కాకుండా ఇతర అంశాలకు యూరియా వినియోగిస్తే కఠినంగా వ్యవహరించాలని క్రిమినల్ కేసుల నమోదు చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు.
ఎరువుల అంశంలో ఫిర్యాదులను నమోదు చేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్ జిల్లాలలో ప్రచారం చేయాలని అన్నారు.
రాష్ట్రంలో నూతనంగా దాదాపు 7 లక్షల రేషన్ కార్డులను ,31 లక్షల లబ్ధిదారులతో మంజూరు చేసామని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 96 లక్షల 96 వేల రేషన్ కార్డులు ఉన్నాయని, 3 కోట్ల 10 లక్షల మంది లబ్ధిదారులు రేషన్ కార్డు ఉపయోగిస్తున్నారని అన్నారు. గతంలో దొడ్డు బియ్యం ఉన్నప్పుడు ప్రజలు ఎక్కువ పట్టించుకోలేదని బ్లాక్ మార్కెట్లో పోయేదని, ప్రస్తుతం సన్న బియ్యం సరఫరా చేయడంతో చాలా డిమాండ్ వచ్చిందని, ప్రజలు తప్పనిసరిగా రేషన్ తీసుకుంటున్నారని సీఎం సంతోషం వ్యక్తం చేశారు.
జూలై 25 నుంచి ఆగస్టు 10 వరకు జిల్లా కలెక్టర్, ప్రజా ప్రతినిధులు మండల కేంద్రాలలో అధికారికంగా రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం చేపట్టాలని, వీటిలో తప్పనిసరిగా స్థానిక ఎమ్మెల్యేలు, కలెక్టర్ పాల్గొనేలా చూడాలని సీఎం తెలిపారు.
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం ఒక చోట ఉమ్మడి జిల్లా ఇంచార్జి మంత్రి  ఒక చోట పాల్గోనేలా కలెక్టర్ కోఆర్డినేట్ చేసుకోవాలని సీఎం తెలిపారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఆర్డిఓ స్థాయి అధికారికి బాధ్యతలు అప్పగించాలని అన్నారు. వాతావరణ శాఖ సూచనలను ఎప్పటికప్పుడు గమనిస్తూ కిందిస్థాయి సిబ్బంది అధికారులు ప్రజలను కలెక్టర్ అప్రమత్తం చేయాలని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ , ఇతర జిల్లా అధికారులు ఐడిఓసి కార్యాలయం నుండి పాల్గొన్నారు.

Related Posts