
మావోయిస్టు లేఖ కలకలం.
ములుగు నవంబర్ 25,
ములుగు జిల్లాలో మావోయిస్టు లేఖ కలకలం రేపింది. జిల్లా లో అధికార పార్టీ నాయకుల దుశ్చర్యలపై మరోసారి హెచ్చరిస్తూ లెఖను మావోయిస్టులు విడుదల చేసారు. వెంకటాపురం మండలం సుడిబాక గ్రామ ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై ప్రధానంగా హెచ్చరిస్తూ లేఖ విడుదల అయింది. అక్రమంగా భూ కబ్జాలకు పాల్పడుతూ రెవెన్యూ అధికారులకు లంచాలు ఇస్తూ చేస్తున్న దుశ్చర్యలను మానుకోవాలంటూ మావోయిస్ట్ వెంకటాపురం- వాజేడు కార్యదర్శి సుధాకర్ హెచ్చరించారు. అధికార పార్టీ ముసుగులో పాల్పడుతున్న ప్రజావ్యతిరేఖ విధానాలను పాల్పడితే ప్రజాకోర్టులో చర్యలు తప్పవంటూ లేఖలో పేర్కోన్నారు. .