YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

డ్రెయిన్‌లో దీప్తిశ్రీ మృతదేహం లభ్యం

డ్రెయిన్‌లో దీప్తిశ్రీ మృతదేహం లభ్యం

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో చిన్నారి సూరాడ దీప్తిశ్రీ (7) అదృశ్యం ఘటన విషాదాంతమైంది. శుక్రవారం మధ్యాహ్నం అపహరణకు గురైన చిన్నారి కోసం మూడు రోజులుగా పోలీసులు గాలించగా.. తాజాగా కాకినాడలోని ఇంద్రపాలెం డ్రెయిన్‌లో దీప్తిశ్రీ మృతదేహం లభ్యమైంది. సవతి తల్లి శాంతికుమారే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. దీప్తిశ్రీని సవతి తల్లి తీసుకురావడంతో పాటు గోనెసంచి మూటను ఉప్పుటేరు వంతెనపై పెట్టిన దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి.  

కాకినాడ నగరానికి చెందిన సత్యశ్యామ్‌ ప్రసాద్‌ కుమార్తె దీప్తిశ్రీ స్థానిక జగన్నాథపురంలోని నేతాజీ పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. పాప తల్లి మూడేళ్ల క్రితం చనిపోవడంతో.. శ్యామ్‌ ప్రసాద్‌ మరో వివాహం చేసుకున్నాడు. రెండో భార్య శాంతకుమారి, కుమారుడితో కలిసి సంజయ్‌నగర్‌లో నివాసం ఉంటున్నాడు. దీప్తిశ్రీ తూరంగిలోని పగడాల పేటలో మేనత్త వద్ద ఉంటోంది. రోజూ మాదిరిగానే శుక్రవారం పాఠశాలకు వెళ్లిన ఆ చిన్నారిని.. మధ్యాహ్న భోజనసమయంలో బడి ఆవరణలో ఆడుకుంటుండగా అపహరణకు గురైంది. బాలిక తండ్రి సత్యశ్యామ్‌కుమార్‌ ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన కాకినాడ ఒకటో పట్టణ పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారణ ముమ్మరం చేశారు. ఈ కేసులో కీలకమైన వ్యక్తిగా భావించిన బాలిక సవతి తల్లి శాంతకుమారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఆమె ఇచ్చిన సమాచారంతోపాటు.. దర్యాప్తులో కోణాల ఆధారంగా మూడు బృందాలుగా ఏర్పడి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ధర్మాడి సత్యం బృందం ఉప్పుటేరులో రెండు రోజులపాటు గాలించింది.

Related Posts