YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

భారతీయులా.. మజాకా?.. ఆ విషయంలో ఇండియాకు రెండోస్థానం!

భారతీయులా.. మజాకా?.. ఆ విషయంలో ఇండియాకు రెండోస్థానం!

మొబైల్ యాప్ డౌన్‌లోడ్స్‌లో భారత్ అమెరికాను దాటేసి చైనా దరిదాపుల్లోకి వచ్చేసింది. ‘యాప్ అనీ’ అనే థర్డ్ పార్టీ ఏజెన్సీ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. యాపిల్ ఐఓఎస్ స్టోర్, గూగుల్ ప్లే, మిగతా థర్డ్ పార్టీ స్టోర్ల నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న యాప్స్‌ను పరిగణనలోకి తీసుకుని ఈ సర్వే నిర్వహించారు. యాప్ డౌన్‌లోడ్లలో చైనా తొలి స్థానంలో కొనసాగుతుండగా, అమెరికాను వెనక్కి నెట్టేసి భారత్ రెండో స్థానాన్ని ఆక్రమించింది.

టెలికం రంగంలోకి రిలయన్స్ జియో ప్రవేశంలో ఒక్కసారిగా డేటా వినియోగం పెరిగిపోయింది. 2017లో యాప్ డౌన్‌లోడ్స్‌ భారత్‌లో 215 శాతం పెరగ్గా, అమెరికాలో 5 శాతం తగ్గింది. సగటున ప్రతీ భారతీయుడు నెలకు 40కిపైగా యాప్స్‌ను ఉపయోగిస్తున్నాడు. ఈ విషయంలో చైనా, బ్రెజిల్‌ కంటే భారత్ ముందుంది. విచిత్రమేమిటంటే.. యాప్స్ కొనుగోలుకు, డేటింగ్ యాప్స్‌కు దూరంగా ఉంటున్నారట.

Related Posts