YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

జేఎన్టీయూలో నకిలీ ప్రొఫెసర్లు

జేఎన్టీయూలో నకిలీ ప్రొఫెసర్లు

జేఎన్టీయూలో నకిలీ ప్రొఫెసర్లు
హైద్రాబాద్, జనవరి 14  
జవహార్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం  పరిధిలోని పలు ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీల్లో నకిలీ ప్రొఫెసర్లుగా చెలామణి అవుతున్న వారి బాగోతం బయటపడింది. వీరంతా నకిలీ పీహెచ్‌డీలు పొంది, బోధిస్తున్నట్లు ధ్రువీకరించారు. నకిలీ ప్రొఫెసర్లపై తొలుత ఫిర్యాదులు వెల్లువెత్తడంతో జేఎన్‌టీయూ అధికారులు ఈ వ్యవహారంపై విచారణ చేపట్టారు. గత పక్షం రోజుల్లో మొత్తం 300 మందికి పైగా ప్రొఫెసర్ల పీహెచ్‌డీ పట్టాలను పరిశీలించగా, వీటిల్లో సుమారు వంద వరకూ డమ్మీ డిగ్రీలని తేలింది. నకిలీ ప్రొఫెసర్లపై చట్టబద్ధంగా కఠిన చర్యలు తీసుకునేందుకు విశ్వవిద్యాలయ అధికారులు సన్నద్ధమవుతున్నారు. కొందరు ప్రొఫెసర్లు బీటెక్‌ చదవకుండానే ఎంటెక్‌ సర్టిఫికెట్లు చూపిస్తుండడం గమనార్హం.ఈ నకిలీ ప్రొఫెసర్ల వ్యవహారంలో అధికారుల నిర్లక్ష్యముందనే వాదనలు వినిపిస్తున్నాయి. నకిలీ పీహెచ్‌డీల అంశం మూడేళ్లుగా కొనసాగుతూ ఉన్నా అధికారులు తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని అంటున్నారు. అప్పట్లోనే బాధ్యులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసి ఉంటే బాగుండేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అసలు ఈ విషయం ఎప్పుడో వెలుగులోకి వచ్చినా ఇన్నాళ్లూ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నిస్తున్నారు.ఇతర రాష్ట్రాల్లోని ప్రైవేటు యూనివర్సిటీలు కేంద్రంగా నకిలీ పీహెచ్‌డీ పట్టాల దందా జోరుగా సాగుతోందనే ఆరోపణలు ఉన్నాయి. దీనివల్లే నకిలీ పీహెచ్‌డీ పట్టాలు సాధ్యమయ్యాయని తెలుస్తోంది. తాజాగా జేఎన్‌టీయూ గుర్తించిన నకిలీ పీహెచ్‌డీల్లో అత్యధికం మంది ఇలా సంపాదించనవే ఉండడం గమనార్హం. తరగతులకు హాజరు కాకుండానే ఇతర రాష్ట్రాలకు చెందిన యూనివర్సిటీలు పట్టాలు జారీ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

Related Posts