YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వింతలు నవ్వుకోండి దేశీయం

ఆ..దున్నపోతు ధర అక్షరాల రూ.14 కోట్లు

ఆ..దున్నపోతు ధర అక్షరాల రూ.14 కోట్లు

ఆ..దున్నపోతు ధర అక్షరాల రూ.14 కోట్లు
జైపూర్ ఫిబ్రవరి 3
ఊరు బ్యాగ్రౌండ్ ఉన్నోళ్లకు దున్నపోతు గురించి తెలియంది కాదు. నగరాల్లో పుట్టి పెరిగి.. ఒక తరహా జీవనశైలికి అలవాటు పడిన వారికి మాత్రం దున్నపోతు అన్నంతనే పుస్తకాల్లోనూ.. టీవీల్లోనూ.. అప్పుడప్పుడు ఊళ్లకు వెళ్లినప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఎంత తెలీకున్నా.. దున్నపోతు ధర అంటే రూ.లక్షకు మించి చెప్పే వారుండరు. కానీ.. ఇప్పుడు చెప్పే దున్నపోతు సో స్పెషల్. దీని వ్యవహారమే భిన్నం.దీని ధర ఎంతో తెలుసా? అక్షరాల రూ.14 కోట్లు. నమ్మరు కానీ ఇది నిజం. ఇంత భారీ ధర పలుకుతుంది కదా? దాని యజమాని దానిని అమ్ముతారా? అంటే.. నో అంటే నో చెప్పేస్తారు. దాదాపు 1300 కేజీల బరువు ఉండే ఈ దున్నపోతు ప్రత్యేకతలు భారీగానే ఉన్నాయని చెప్పాలి. ఇంతకీ ఇదెక్కడ ఉందంటారా? అక్కడికే వస్తున్నాం. రాజస్థాన్ లోని అరవింద్ అనే పెద్ద మనిషి దగ్గర ఉన్న భీముడనే దున్నపోతు ఇప్పుడు అందరిని ఆకర్షిస్తుంటుంది. ఎక్కడైనా దున్న పోతులకు సంబంధించిన పోటీల్లో కానీ.. ప్రదర్శన లో కానీ భీముడు లేకుంటే పెద్ద లోటే. ప్రస్తుతం మార్కెట్లో భీముడి ధర రూ.14 కోట్లు పలుకుతుంది.ముర్రా జాతి పశువుల్లో భీమ్ దున్నపోతు మొదటిస్థానంలో నిలిచింది. తాజాగా రాజస్థాన్ లోని నాగోరీలో జరిగిన పశువుల మేళాలో దీనికి రూ.14 కోట్ల ధర పలికినా.. దీని యజమాని అరవింద్ మాత్రం దీన్ని వదులుకోవటానికి ఇష్టపడటం లేదు. ఇంత ఖరీదైన భీమ్ పోషణ కూడా ఖరీదైనదే సుమా.ఎందుకంటే.. దీని రోజువారీ అలనాపాలనా చూసేందుకు తక్కువ లో తక్కువ రూ.4వేల వరకూ ఖర్చు అవుతూ ఉంటుంది. పశు వైద్యుల డైట్ ను తూచా తప్పకుండా ఫాలో అవుతున్నారు. సోయాబీన్.. శనగలు వంటి ధాన్యాలతో ప్రోటీన్ డైట్ ను ఫాలో అవుతున్నారు. భీమ్ కు ఉదయాన్నే వ్యాయామం చేశాక.. ఆయిల్స్ తో ప్రత్యేక మర్థన చేస్తుంటారు. అంతేకాదు.. దాని అలనాపాలనా చూసుకునేందుకు ఇద్దరు నమ్మకస్తులైన కాపలా వ్యక్తులు కంటికి రెప్పలా కాపాడుతుంటారు. రూ.14 కోట్ల విలువైన భీముడికి ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకోకుండా ఉంటారా ఏంటి?

Related Posts