YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఐదేళ్ల పాటు పోరాటం...

ఐదేళ్ల పాటు పోరాటం...

అమరావతి, మే 1, 
అమరావతి రాజధాని నిర్మాణానికి శరవేగంగా అడుగులు పడుతున్నాయి. మే 2న ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అక్కడ నుంచి పనులు వేగవంతం కానున్నాయి. గత అనుభవాల దృష్ట్యా అమరావతి విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు సీఎం చంద్రబాబు. అమరావతిని శాశ్వత రాజధానిగా గుర్తింపు ఇవ్వాలని కేంద్రాన్ని కోరనున్నారు. ఈ మేరకు ఏపీ అసెంబ్లీలో ప్రతిపాదనలు తయారుచేసి కేంద్రానికి నివేదించనున్నారు. పార్లమెంట్లో ప్రత్యేక చట్టం చేసి అమరావతిని శాశ్వతం చేయాలని చూస్తున్నారు చంద్రబాబు. ఇదే విషయాన్ని చంద్రబాబు అమరావతి రైతులకు స్పష్టం చేశారు. ఎటువంటి అపోహలు వద్దని.. మీ భవిష్యత్తుకు నేను అండగా ఉంటాను అని.. అందుకు తగ్గట్టు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటానని చంద్రబాబు వారికి హామీ ఇచ్చారు. రాజధాని రైతులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. వారి అనుమానాలను నివృత్తి చేశారు.2014లో టిడిపి అధికారంలోకి వచ్చింది. అప్పట్లో అందరి ఆమోదంతో అమరావతి రాజధానిని ఎంపిక చేశారు నాటి సీఎం చంద్రబాబు. దాదాపు 33 వేల ఎకరాల భూమిని రైతులు స్వచ్ఛందంగా అమరావతి రాజధానికి ఇచ్చారు. 2017 లో ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అప్పటినుంచి పనులు ప్రారంభించింది టిడిపి సర్కార్. కానీ అప్పట్లో ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో నిధుల సమీకరణ, నిర్మాణాల విషయంలో ఇప్పటిలా సహకారం కేంద్రం నుంచి లభించలేదు. అదే సమయంలో రాజకీయంగా కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండేది. ప్రత్యేక హోదా అంశాన్ని తెరపైకి తెచ్చి చంద్రబాబును డిఫెన్స్ లో పెట్టింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అలా 2018లో కేంద్రాన్ని విభేదించి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు చంద్రబాబు. 2019 ఎన్నికల్లో మూల్యం చెల్లించుకున్నారు. బిజెపిని విభేదించి ఓడిపోయారు.వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని పూర్తిగా నిర్వీర్యం అయింది. జగన్ సర్కార్ మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చింది. అప్పటినుంచి అమరావతి రైతులు పోరాట బాట పట్టారు. అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. అమరావతి టు తిరుపతి, అమరావతి టు అరసవెల్లి పేరిట అమరావతి రైతులు యాత్ర చేపట్టారు. ఒకవైపు న్యాయపోరాటం చేస్తూనే మరోవైపు దేవుడి ప్రాపకం కోసం కూడా పరితపించారు. ఒక్క మాటలో చెప్పాలంటే అమరావతి పై రైతులు ఆశలు వదులుకున్నారు. అటు అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు తెరపైకి తెచ్చి అమరావతిని నిర్వీర్యం చేశారు. కానీ పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్రం సైలెంట్ గా ఉండిపోయింది. రాజకీయ కారణాలతో కనీసం స్పందించలేదు. దీంతో అమరావతి రైతులు ఆశలు వదులుకున్నారు.అయితే కూటమి అధికారంలోకి రావడంతో అమరావతి రైతులు ఊపిరి పీల్చుకున్నారు. అందుకు తగ్గట్టుగానే కూటమి ప్రభుత్వం అమరావతి రాజధాని నిర్మాణం పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. కేంద్రం సైతం గతం కంటే భిన్నంగా సాయం విషయంలో ఉదారంగా వ్యవహరిస్తోంది. కేంద్రంలో టిడిపి కీలక భాగస్వామి కావడంతో అమరావతిని శాశ్వత రాజధానిగా గుర్తించాలని టిడిపి ఒత్తిడి చేస్తోంది. ఈ మేరకు ఏపీ అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి కేంద్రానికి నివేదించునున్నారు. పార్లమెంట్లో ప్రత్యేక చట్టం చేసి అమరావతిని పదిలం చేయాలని చంద్రబాబు మాస్టర్ ప్లాన్ వేశారు. అదే విషయాన్ని అమరావతి రైతులకు చెప్పడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. ఇంకోవైపు అదనపు భూముల సేకరణకు సంబంధించి కూడా ఎటువంటి అపోహలు వద్దని.. అన్ని తాను చూసుకుంటానని చంద్రబాబు చెప్పడం విశేషం.

Related Posts