YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మాటల్లో తేనె, చేతల్లో కత్తెర

మాటల్లో తేనె, చేతల్లో కత్తెర

మాటల్లో తేనె, చేతల్లో కత్తెర
అమరావతి  ఫిబ్రవరి 24 
‘వసతి దీవెన’’, జగన్ మరో ‘‘మాయ’’ పథకమని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. సోమవారం అయన మీడియాతో మాట్లాడారు. టిడిపి 
పథకానికే పేరు మార్చి జగన్ అకౌంట్ లో జమ చేసుకున్నారు.  ‘‘జగనన్న వసతి దీవెన’’ మరో జగన్మాయే తప్ప కొత్త స్కీమ్ కాదు. టిడిపి గతంలో పథకాన్నే పేరుమార్చి కొత్త 
స్కీమ్ గా బిల్డప్ ఇస్తున్నారు.  డైట్ ఛార్జీల కింద నెలకు రూ 1,400చొప్పున 10నెలల్లో రూ 14వేలు ఇచ్చాం, దీనికి అదనంగా మరో 5వేలు కాస్మటిక్స్ కింద అందజేశామని అన్నారు. టిడిపి ఇచ్చిన 19వేలకు మరో రూ 1,000 ఒకచేత్తో ఇచ్చి, మరో చేత్తో లాగేస్తున్నారు.  75% హాజరు ఉండాలని, కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందని కొర్రీలు పెడుతున్నారు.  రూ 1,000 ఇచ్చి, పబ్లిసిటీకి రూ కోటి ఖర్చు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, ఈబిసి, కాపు, మైనారిటి, దివ్యాంగ విద్యార్ధుల ఉపకార వేతనాలు(ఎంటిఎఫ్) రేట్లు పెంచింది తెలుగుదేశం ప్రభుత్వమే.  డిపార్ట్ మెంట్ అటాచ్డ్ హాస్టళ్లలో ఎంటిఎఫ్ 33.33% పెంచాం. కాలేజి అటాచ్డ్ హాస్టళ్లలో ఎంటిఎఫ్ 130.7% పెంచాం.  డే స్కాలర్లకు ఎంటిఎఫ్ 150% పెంచామని అన్నారు. ఈబిసి, కాపు విద్యార్ధులకు ఎంటిఎఫ్ తొలిసారిగా ఇవ్వడం ప్రారంభించింది తెలుగుదేశం ప్రభుత్వమే.  ఎస్సీ,ఎస్టీలకు సమానంగా దివ్యాంగ విద్యార్ధులకు(డి డబ్ల్యు) ఎంటిఎఫ్ ఇచ్చాం.  బిసిలకు సమానంగా ఎంటిఎఫ్ కాపు  విద్యార్దులకు కూడా ఎంటిఎఫ్ ఇచ్చాం. డైట్ ఛార్జీలను నెలకు రూ 1,400కు పెంచింది టిడిపి ప్రభుత్వమే.  ప్రి మెట్రిక్ హాస్టళ్లలో వారానికి 2గుడ్లను 5గుడ్లకు పెంచాం, చికెన్ 3సార్లు ఇచ్చాం. పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో వారానికి 2సార్లు ఇచ్చాం.  ప్రతిరోజూ 200మిలీ పాలు, రాగిపిండి, చిక్కి(వేరుశనగ పప్పు పాకం) టిడిపి ప్రవేశ పెట్టిందే. ఇప్పుడు అక్కడికి తానేదో కొత్తగా ఇస్తున్నట్లు జగన్మోహన్ రెడ్డి ఫోజులు కొడుతున్నారు. మాటల్లో తేనె, చేతల్లో కత్తెర జగన్ నైజమని అయన విమర్శించారు.

Related Posts