YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి ఆరోగ్యం తెలంగాణ

61 స్కూళ్ల విద్యార్థులకు పరీక్షలు

61 స్కూళ్ల విద్యార్థులకు పరీక్షలు

61 స్కూళ్ల విద్యార్థులకు పరీక్షలు
హైద్రాబాద్,మార్చి 4 
నగరంలో కరోనా వైరస్ (కొవిడ్ -19) కేసు బయటపడడంతో పాఠశాల విద్యాశాఖ కూడా అప్రమత్తమైంది. విద్యార్థుల్లో అవగాహన కల్పించే చర్యల్లో భాగంగా  హైదరాబాద్ జిల్లాలోని అన్ని పాఠశాలలకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలను బుధవారం నుంచి  ఉదయం ప్రార్థన సమయంలో విద్యార్థులకు ఉపాధ్యాయులు వివరిస్తున్నారు. ఈ విషయాలు పాటించేలా విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయిస్తున్నారు. మధ్యాహ్న భోజనానికి ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవడం, మరుగు దొడ్లకు వెళ్లి వచ్చినప్పుడు కాళ్లు, చేతులు శుభ్రపరుచుకోవడం వంటి  విషయాలను వివరిస్తున్నారు. మరోవైపు, కరోనా వైరస్ సోకి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువకుడి నివాసం ఉన్న ప్రాంతంలోని పాఠశాలలపై  విద్యాశాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. అక్కడి చుట్టుపక్కల 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న బడులను మంగళవారం అధికారులు గుర్తించారు. 61 పాఠశాలలను ఎంపిక చేసి వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఐదుగురు విద్యార్థులను ఉపాధ్యాయులు నిలోఫర్ ఆసుపత్రిలో చేర్పించారు. కోఠి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న వీరు కొన్ని రోజులుగా గైర్హాజరవుతున్నారు. వెంటనే  వారిని నిలోఫర్ ఆసుపత్రికి తీసుకెళ్లి చేర్పించారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్లు అధికారులు చెప్పారు. 

Related Posts