YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

విశాఖలో కరోనా ఛాయలు

విశాఖలో కరోనా ఛాయలు

విశాఖలో కరోనా ఛాయలు
విశాఖపట్టణం, మార్చి 5
విశాఖపట్నం అంతర్జాతీయ నగరం. ఓ విధంగా మినీ ఇండియా. అన్ని రాష్ట్రాల వారూ, వివిధ దేశాల వారూ వస్తూంటారు, పోతూంటారు. అటువంటి కాస్మోపోలిటన్ సిటీ ఇపుడు కరోనా భయంలో కంగారు పడుతోంది. ఎక్కడ నుంచి ఎక్కడికైనా వెళ్ళి వచ్చే విదేశీ విమాన సదుపాయాలు ఉన్న చోట, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన కార్యాలయాలు, బిజినెస్ సెంటర్లు, వాణిజ్య కార్యకలాపాలు పెద్ద ఎత్తున జరిగే చోటా కరోనా భయం ఇపుడు ఒక్కసారిగా పట్టుకుంది.కరోనా భయంతో ఇపుడు ఓ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం వాయిదా పడింది. ఈ నెల 18 నుంచి 28 వరకూ మిలాన్ పేరిట జరిగే అంతర్జాతీయ నౌకాదళ సదస్సుని వాయిదా వేసినట్లుగా విశాఖ తూర్పు నౌకాదళ అధికార వర్గాలు తెలియచేస్తున్నాయి. ఈ సదస్సుకు ప్రపంచంలోకి దాదాపుగా 48 దేశాల నుంచి పెద్ద ఎత్తున అంతర్జాతీయ ప్రతినిధులు హాజరవుతారని అంటున్నారు. అలాగే యుధ్ధ నౌకలు కూడా అన్ని దేశాల నుంచి వచ్చి విశాఖ తీరంలో కొలువుతీరుతాయి.అయితే చైనా సహా ప్రపంచాన్ని హడలెత్తిస్తునన్ కరోనా వైరస్ కారణంగా ఈ అంతర్జాతీయ సదస్సున్ని కొన్నాళ్ళ పాటు వాయిదా వేసుకున్నారు. ఈ సదస్సుకు వచ్చే ప్రతినిధులు తమ వెంట కరోనా భూతాన్ని మోసుకొస్తే విశాఖ మొత్తం అల్లకల్లోలం అవుతుందని కూడా హడలిపోతున్నారు. ప్రస్తుతానికికి విదేశీ సంబంధాలను పూర్తిగా కట్ చేసుకోవాలని కూడా నిర్ణయించారు. ఈ పరిణామంతో ఎంతో ఆర్భాటంగా చేసుకున్న ఏర్పాట్లు కూడా వృధా అయ్యాయి.అదే విధంగా విశాఖలోని వివిధ స్థాయిలలో అంతర్జాతీయ సదస్సులు కూడా మరో మూడు నెలల వరకూ నిర్వహించరాదని కూడా అధికార వర్గాలు కీలక నిర్ణయం తీసుకున్నారని సమాచారం. విశాఖ ఎపుడూ అంతర్జాతీయసదస్సులకు వేదికగా ఉంది. కరోనా దెబ్బకు ఇపుడు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. అలాగే వాణిజ్య కార్యకలాపాల మీద కూడా కరోనా ప్రభావం పడుతోంది. మొత్తానికి ఆసియా ఖండంలోనే వేగంగా అభివృధ్ధి చెందిన విశాఖ ఇపుడు కరోనా దెబ్బకు తనను తాను బాగా తగ్గించుకుంటోంది.

Related Posts