YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

జాతీయ ఉపాధి హామీ పథకంలో అక్రమాలు

జాతీయ ఉపాధి హామీ పథకంలో అక్రమాలు

జాతీయ ఉపాధి హామీ పథకంలో అక్రమాలు
పనిచేసినప్పటికీ మాస్టర్ జమ చేయని అధికారులు
ఏపీవో కాసిం సాహెబ్
పగిడ్యాల మే 23
పగిడ్యాల మండలం లోని జాతీయ ఉపాధి హామీ పథకంలో పనుల్లో అక్రమాలకు నిలయంగా మారినట్ల ప్రజా సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. అందుకు నిదర్శనం ప్రత్యక్షంగా నెహ్రూ నగర్ గ్రామంలోని జాతీయ ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్ చేతివాటం చూపించినవారికే ఉపాధి పనులు చూపించడం జరుగుతుందని. ఉపాధి సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఇందుకు నిదర్శనం నెహ్రూ నగర్ గ్రామం లోని ఈ చంద్ర గౌడ్ ఉపాధి సంఘం గ్రూప్ నెంబర్ 130 వారం రోజులు పని చేసిన గ్రూప్ వర్క్ ఐడి నెంబర్ 13185090100171852 చేయడం జరిగిందని గ్రూప్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేసవి తాపాన్ని ఎదుర్కొని ఉపాధి పనుల్లో గాయాలపాలై పనిచేసినప్పటికీ ఫీల్డ్ అసిస్టెంట్. టెక్నికల్ అసిస్టెంట్. ఏ పీ ఓ కాసిం సాహెబ్ ఇలా ఎన్నో గ్రూపులకు అన్యాయం జరిగిన పట్టించుకోవడంలేదని జాతీయ ఉపాధి  సంఘాల సభ్యులు మండిపడుతున్నారు. కరోనా మహమ్మారి వల్ల దాదాపుగా రెండు నెలల నుండి గృహనిర్బంధం లాక్ డౌన్ కారణంగా ఎలాంటి ఉపాధి లేకుండా ఇంటికే పరిమితం అయ్యానని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ ఉపాధి హామీ పథకం పనులు ఏర్పాటు చేయడం జరిగింది.. నిరుపేదలు ఒక్క పూటైన భోజనం చేయొచ్చు అనే ఉద్దేశంతో జాతీయ ఉపాధి హామీ పథకం పనులకు వెళ్లడం జరుగుతుందని చేసిన పనులకు బిల్లులు మంజూరు చేయకుండా చేతివాటం చూపించిన వారికే బిల్లులు మంజూరు చేయడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలో నెహ్రూ నగర్. కొత్త ముచ్చు మర్రి. లక్ష్మాపురం. ప్రాతకోట. సంకినరేని పల్లె. ఎం ఎన్ గణపురం. పగిడ్యాల. బీరవోలు. పాత ముచ్చుమర్రి. గ్రామాలలో దాదాపుగా వందలాది ఉపాధి సంఘాలు పనిచేస్తున్నాయని ప్రతి ఒక్కరు పనికి వెళ్లినప్పటికీ సరైన వేతనం రాకుండా గ్రామ స్థాయి నాయకులు. ఫీల్డ్ అసిస్టెంట్లు. టెక్నికల్ అసిస్టెంట్లు. ఏ పీ ఓ. అడ్డుకోవడం జరుగుతుందని ఇలాంటి పేద వారి కడుపులు మండుతున్న  వారి బాధలు కనిపించడం లేదని ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ సార్ గారు మరియు జిల్లా స్థాయి అధికారులు పి డి..ఏ పి డి అధికారులు తక్షణమే చర్యలు తీసుకొని తాము చేస్తున్న ఉపాధి పనులను గుర్తించి తగిన వేతనం వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఉపాధి సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి .

Related Posts