YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

ఫంక్షన్ హాల్సే.. ఐసోలేషన్ కేంద్రాలు

ఫంక్షన్ హాల్సే.. ఐసోలేషన్ కేంద్రాలు

హైద్రాబాద్, జూలై 20, 
కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హోం ఐసోలేషన్ సౌకర్యం లేని వారికి ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. ఇప్పటికే నేచర్ క్యూర్, ఎర్రగడ్డ ఆయుర్వేద హా స్పిటల్స్‌లో ఐసోలేట్ కేంద్రాలు కొనసాగుతుండగా, తాజాగా జిహెచ్‌ఎంసి పరిధిలో ఫంక్షన్ల హా ల్స్‌లోనూ ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు వైద్యశాఖ సిద్ధం అయింది. లక్షణాలు లేకుండా, స్పల్ప తీవ్రతతో వైరస్ సోకిన వారికి ఇంట్లో ఉండేందుకు వెసులుబాటు లేకపోతే ఇక నుంచి స్థానికంగా ఉండే ఫంక్షన్ హాల్స్‌లోనూ చికిత్సను అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లను చేస్తోంది. దీంతో పాటు సరోజినీ దేవిలో 200 బెడ్ల తో, చార్మినార్ ఆయుర్వేదలో మరో 150 బెడ్లు, రామాంతపూర్‌లోనూ ఐసోలేట్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.రోజురోజుకి అసింప్టమాటిక్, మైల్డ్ సింప్టమ్స్‌తో వైరస్ సోకుతున్న వారి సంఖ్య పెరగడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైద్యశాఖ అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా, రాష్ట్రంలో సుమారు 85 శాతం మందికి ఎలాంటి లక్షణాలు లేకుండానే వైరస్ సోకుతోంది. అలా పాజిటివ్ వచ్చిన వ్యక్తులను ఐసిఎంఆర్ నిబంధనలకు అనుగుణంగా ఇంట్లోనే ఐసోలేట్ కావాలని ప్రభుత్వం సూచిస్తుంది. దీంతో సదరు రోగికి కూడా మంచిదని అధికారులు అంటున్నారు. దీంతో హాస్పిటల్స్‌లో తీవ్రత ఉన్న వారికి వైద్యం అందించేందుకు కూడా సులువుగా మారుతుందని అధికారులు పేర్కొన్నారు.అయితే అసింప్టమాటిక్ పేషెంట్ల ఇంట్లో దీర్ఘకాలిక రోగులు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, చిన్నారులు ఉన్నట్లయితే అలాంటి వారు ఈ కేంద్రాల్లో చికిత్స పొందాలని అధికారులు సూచిస్తున్నారు. అదే విధంగా ఇరుకు ఇళ్లు, ఇతర సౌకర్యాలు లేని వారు కూడా ప్రభుత్వ కేంద్రాల్లో చికిత్స పొందాలని అధికారులు తెలిపారు. దీంతో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు సులభంగా ఉంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ కేంద్రాల్లో మందులు, వైద్యం, ఆహారం అన్ని ఉచితంగా అందిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. దీంతో పాటు హోం ఐసోలేషన్‌లో ఉన్న వ్యక్తులకు ఇచ్చే మెడికల్ కిట్లు కూడా ఈ కేంద్రాల్లో ఇస్తామని వైద్యాధికారులు పేర్కొంటున్నారు. అయితే ఈ నిర్ణయం పట్ల చాలా మంది కరోనా బాధితులు సంతృప్తి వ్యక్తం చేశారు.

Related Posts