YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ

గ్రేటర్..డేంజర్

గ్రేటర్..డేంజర్

హైద్రాబా్ద్, జూలై 20, 
గ్రేటర్ నగరాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి సమీప జిల్లాలైన రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో విజృంభించి ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. జూన్ చివరి వారం నుంచి వైరస్ రెక్కలు కట్టుకుని అమాయకుల ప్రాణాలను బలిగొట్టుంది. రాష్ట్ర వ్యాప్తంగా 40వేలు పాజిటివ్ కేసులు నమోదుగా కాగా, మూడు జిల్లా పరిధిలో 35వేలు కేసులు నమోదు కావడం మరింత ఆందోళన కలిగిస్తుంది. మార్చి 2న మహేంద్రహిల్స్‌కు చెందిన సాప్ట్‌వేర్ ఇంజనీర్‌తో ప్రారంభమైన కేసు లు పరంపర మర్కజ్ కేసులతో కరోనా ఉనికి చాటుకుని కేసులు సంఖ్య రెండు సంఖ్యలకు చేరింది. మే 15 తరువాత మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు వలస వెళ్లిన కూలీలు తిరిగి స్వస్థలాలకు తిరిగిరావడంతో వైరస్ విశ్వరూపం దాల్చి రోజుకు వందల కేసులు నమోదైయ్యాయి.దీంతో అధికారులు కేసులు ఎక్కువ నమోదయ్యే ప్రాంతాలను కంటైన్‌మెంటు జోన్లు ఏర్పాటు చేసిన మహమ్మారి తన ప్రతాపం చాటుతూ రోజుకు వందలాది మంది ఆసుపత్రుల బాట పట్టేలా చేసింది. జూన్ చివరి వారం నుంచి టెస్టుల సంఖ్య పెంచడంతో రోజుకు 1500 కేసులు బయటపడ్డాయి. కేసులు పెరగడంతో అధికారులు లాక్‌డౌన్‌పై మరోసారి సమాలోచనలు చేశారు. విధించే అవకాశం ఉందని ప్రచారం జరగడంతో వేలాదిమంది కూలీలు, కార్మికులు పల్లెటూరు బాట పట్టారు. జనం పట్టణం వీడటంతో కరోనా కంట్రోల్ అవుతుందని భావించిన అంతకంతకు పెరిగి ఆసుపత్రుల్లో పడకలు నిండిపోతున్నాయి. గాంధీ, చెస్ట్, కింగ్‌కోఠి, నేచర్‌క్యూర్, యునానీ ఆసుపత్రుల్లో కాకుండా గచ్చిబౌలి టిమ్స్ ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇంకా ప్రైవేటు ఆసుపత్రుల్లో వందలాది చికిత్సలు పొందుతున్నారు.లక్షల రూపాయలు చెల్లి ంచి వైద్యం చేయించుకుంటున్నారు. గత వారం రోజుల నుంచి రాష్ట్రంలో నమోదై కేసులు 80శాతం కేసులు ఈమూడు జిల్లాల నుంచి బయ టపడుతున్నాయి. ర్యాపిడ్ టెస్టులు చేయడంతో మరిన్ని పెరిగే అవకాశం ఉందని వైద్యులు పేర్కొంటున్నారు..ఈనెలాఖరు వరకు ఈజిల్లా పరిధిలో రోజుకు 1800లు దాటవచ్చని జిల్లా వైద్యాధికారులు భావిస్తున్నారు.నగర ప్రజలు అత్యవసర పనుల కోసం బయటకు వెళ్లాలి తప్ప సరదా కోసం రోడ్లపైకి రావద్దని,వెళ్లాల్సి వస్తే ముఖానికి మాస్కులు ధరించి,సామాజిక దూరం పాటించాలని స్దానిక వైద్యాధికారులు సూచిస్తున్నారు

Related Posts