YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆరోగ్యం తెలంగాణ

జనాలను గాలికొదిలేస్తారా... హైకోర్టు మొట్టికాయలు 28న సీఎస్ కోర్టుకు రావాలని ఆదేశం

జనాలను గాలికొదిలేస్తారా... హైకోర్టు మొట్టికాయలు 28న సీఎస్ కోర్టుకు రావాలని ఆదేశం

హైద్రాబాద్, జూలై 21,
తెలంగాణలో కరోనా వైరస్ పరిస్థితులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ సహనాన్ని పరీక్షించొద్దని, ఇదే చివరి అవకాశమని స్పష్టం చేసింది. హెల్త్ బులిటెన్‌లో సమగ్ర వివరాలు ఉండాలని ఆదేశించింది. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ్య వెబ్‌సైట్ పునరుద్ధరించాలని సూచించింది. ఈ నెల 28న చీఫ్ సెక్రటరీ, వైద్యారోగ్య కార్యదర్శి న్యాయస్థానం ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఫిర్యాదుల కోసం ఏర్పాటు చేసి వాట్సాప్ నంబర్ గురించి అందరికీ తెలిసేలా విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించింది. ప్రజలు ఫిర్యాదు చేసేందుకు మరిన్ని ఫోన్ నంబర్లు అందుబాటులోకి తేవాలని సూచించిందిహాస్పిటళ్ల వారీగా ఖాళీగా ఉన్న బెడ్ల వివరాలను వెల్లడించాలని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. జిల్లాల వారీగా కేసుల వివరాలను కలెక్టర్లు వెల్లడించాలని ఆదేశించింది. ర్యాపిడ్ టెస్టులు ఏయే హాస్పిటళ్లలో చేస్తున్నారో తెలపాలని సూచించింది. పెళ్లిళ్లు, అంత్యక్రియలకు ఎక్కువ మంది హాజరుకాకుండా చూడాలని సూచించింది. ప్రైమరీ కాంటాక్టులకు జరిపిన పరీక్షల వివరాలను వెల్లడించాలని పేర్కొందా. తమ ఆదేశాలను అమలు చేయడానికి చివరి అవకాశం ఇస్తున్నామని తెలిపింది. తమ ఆదేశాలు అమలు కాకపోతే చర్యలు తప్పవని హెచ్చరించింది. కరోనా నియంత్రణ ప్రభుత్వం, అధికారుల రాజ్యాంగ బద్ధమైన కర్తవ్యం. దానిని విస్మరించొద్దని హితవు పలికింది
కరోనా వైరస్ విషయమై హైకోర్టు మరోసారి తెలంగాణ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. టెస్టులు, కరోనా హెల్త్ బులిటెన్‌లో సమాచారం అసమగ్రంగా ఉందని వ్యాఖ్యానించింది. తమ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై చర్యలు ఎందుకు తీసుకోవద్దని ప్రశ్నించింది. హాస్పిటల్‌లో బెడ్ల సమాచారం ఎందుకు వెల్లడించడం లేదని ప్రశ్నించింది. తాము పదే పదే ఆదేశాలు జారీ చేస్తున్నా ఖాతరు చేయడం లేదని మండిపడింది.రాష్ట్రంలో క‌రోనా కేసులు పెరుగుతుంటే స‌ర్కారు నిద్ర‌పోతుందా అని హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. కరోనా టెస్లు విషయానికి వస్తే పొరుగున ఉన్న ఏపీతో పోలిస్తే.. తెలంగాణ ఎంతో వెనుకబడి ఉందని న్యాయస్థానం స్పష్టం చేసింది.త‌మ ఆదేశాల‌ను ఉల్లంఘించిన అధికారులపై ఎందుకు చ‌ర్య‌లు తీసుకోకూడదో చెప్పాల‌ని.. కేసు నమోదు చేసి ఎందుకు స‌స్పెండ్ చేయ‌కూడ‌దో చెప్పాల‌ని ఏజీని న్యాయస్థానం ప్ర‌శ్నించింది. కరోనా విషయంలో హైకోర్టు అభినందించిందని బులిటెన్‌లో పేర్కొనడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ వైపు మొట్టి కాయలు వేస్తుంటే అభినందించామని ప్రజలను ఎలా తప్పుదోవ పట్టిస్తారని ప్రభుత్వాన్ని నిలదీసింది
 

Related Posts