YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆరోగ్యం దేశీయం

నకిలీ కరోనా ఇంజెక్షన్ల తయారీ..ముఠా అరెస్టు

నకిలీ కరోనా ఇంజెక్షన్ల తయారీ..ముఠా అరెస్టు

సూరత్ జూలై 22 
;: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, గుజారత్ తదితర రాష్ట్రాల్లో ఈ వైరస్ విలయతాండవం చేస్తోంది. ఈ పరిస్థితులను క్యాష్ చేసుకోవడానికి కొందరు నీచులు ప్రయత్నిస్తున్నారు. కరోనా సోకి విషమ పరిస్థితుల్లో ఉన్న పేషెంట్లకు ఉపయోగించే ఓ ఇంజెక్షన్ గురించి తెలుసుకున్న కొందరు.. ఈ సమాచారాన్ని సొమ్ము చేసుకోవాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా అదే పేరుతో నకిలీ ఇంజెక్షన్లు తయారు చేసి అమ్మడం ప్రారంభించారు. ఇదంతా గుజరాత్‌లో జరిగింది. ఈ ముఠాలోని మొత్తం ఐదుగురు సభ్యులను సూరత్ పోలీసులు అరెస్టు చేశారు. పుడ్ అండ్ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు ఓ నకిలీ ఫార్మా కంపెనీపై చేసిన రైడ్‌లో ఈ ముఠా చేస్తున్న పని బయటపడింది.

Related Posts