YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పచ్చదనం తోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుంది - జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్

పచ్చదనం తోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుంది    - జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్

కామారెడ్డి  ఆగస్టు 13  
 సదాశివనగర్, గాంధారి మండలంలోని వివిధ గ్రామాల్లో గురువారం ఆయన పర్యటించారు. సదాశివనగర్ పల్లె ప్రకృతి వనంను పరిశీలించారు. పద్మాజివాడి లో నిర్మిస్తున్న  రైతు వేదిక పనులను పరిశీలించారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పద్మాజివాడి  గ్రామ అవెన్యూ ప్లాంటేషన్ పనులలో నిర్లక్ష్యం వహించినందుకు గ్రామ సర్పంచ్, పంచాయతీ సెక్రెటరీలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని డి.పి.ఓ. ను ఆదేశించారు. భూంపల్లి శివారులో అవెన్యూ ప్లాంటేషన్ లో నాటిన మొక్కలు ఎండిపోయినందుకు  పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని డి.పి.ఓ.ను ఆదేశించారు.  నాటిన మొక్కలను పర్యవేక్షణ చేయనందుకు సదాశివనగర్ ఎంపీడీవో, ఎం పి ఓ లకు చార్జి మెమోలు జారీ చేయాలని ఆదేశించారు. గుడిమెట్ , పోతంగల్ గ్రామాల్లో  హరిత హారంలో నాటిన మొక్కలను పరిశీలించారు. మొక్కల సంరక్షణలో నిర్లక్ష్యం వహిస్తే సర్పంచులు , అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోతంగల్ లోని రైతు వేదిక భవన నిర్మాణం పనులను పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి నరేష్, ఏ పి డి సాయన్న, తాసిల్దార్ రవీందర్,  సర్పంచులు సదాశివనగర్  శ్రీనివాస్ రెడ్డి, పద్మాజివాడి కవిత, మోడె గాం తిరుమల, భూంపల్లి లలితా బాయ్, అధికారులు పాల్గొన్నారు

Related Posts