YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

శ్రీ రామదూత....

శ్రీ రామదూత....

తపస్సు   ఆత్మజ్ఞానం  మోక్షం
*తపస్సు అంటే ఇల్లు విడిచి పెట్టాలి, అడవులు పట్టాలి, ఆశ్రమాల్లో చేరాలి అని కాదు. భగవంతుని కోసం నిరంతరం తపించటాన్నే ‘తపస్సు’ అంటారు. మనోవాక్కాయకర్మల యందు ఆధ్యాత్మిక చింతనతో తపించటాన్నే తపస్సు అంటారు. నిత్యకృత్యాలు నెరవేరుస్తున్నా భగవంతునితో అనుసంధానం అయి ఉండే కార్యాచరణను కావించటాన్నే తపస్సు అంటారు. ఈ విధంగా ప్రతి మానవుడు పారమార్ధిక ఆత్మనిగ్రహ ప్రయత్నాన్ని ఒక్కొక్క తపస్సుగా గ్రహిస్తాడు. అట్లా తపస్సు చేయటం వలన మల విక్షేప ఆవరణలు అనే త్రివిధ దోషాలు తొలగిపోతాయి. శ్రవణం చేత మల దోషం, మననం చేత విక్షేప దోషం మరియు నిరంతర ధ్యానమనే నిధిధ్యాస చేత ఆవరణ దోషం తొలగుతుంది. ఈ విధంగా మనస్సుని శుద్ధి చేసుకున్న వారికి పాపాలు క్షీణిస్తాయి. వసనాక్షయం జరుగుతుంది. పూర్వ జన్మ వాసనలు క్రమేపి తోలగుతాయి. ఆ విధంగా మనస్సు పాపవాసనాక్షయం చేకూర్చుకోగానే ప్రశాంతత నొందిన రూపం మనస్సుకు చేకూరుతుంది. శారీరకమైన ఆవేదనల్ని, ఇంద్రియలోలత్వాన్ని బుద్దిపుర్వకంగా నిగ్రహించుకోవటం వలన మానవునికి ప్రశాంతత ఏర్పడుతుంది. కాన శారీరకంగాను, మానసికంగాను, తపస్సనేధనాన్ని పొందాలి.*
*ప్రతి మానవుడు తానూ జీవించే విధానంలో, తన పరిసరాల్లో ఆ వాతావరణంను పెంపొందించుకోవాలి. తన ఇల్లే తనకు, తపస్సుకు కూడ అనుకూలంగా కుదిరేటట్లు మార్చుకోవాలి. మొదట తానూ మారాలి? ఎందుకు? ఎందుకంటే నిత్యమైన, శాశ్వతమైన దానిని తెలుసుకున్నాము మరియు జీవిత లక్ష్యము తెలుసుకున్నాము, అదియే మోక్షము. ఆ మోక్ష సాధన కోసం మారాలి. మానవుడై పుట్టిన ప్రతివాడిని భగవంతుడు తనను చేరమని, చేరటానికి దారితెలుసుకోమని (నిర్దేశించాడు ,ఉద్దేశించాడు) ఏర్పరచినాడు. మానవుడు దాన్ని మరచిపోయి జీవిస్తున్నాడు. అట్లా కాకుండా మానవుడు త్రికరణ శుద్దిగా తపస్సంపన్నుడు కావాలి.*
*మోక్షం అంటే మనస్సుని, శరీరాన్ని అత్మనుంచి శరీరం ఉండగానే, చైతన్యం ఉండగానే వేర్పాటు చేయడం అన్నమాట. మోక్షం అంటే మరణించిన తర్వాత పొందేది కాదు. బ్రతికి ఉండగానే ఆత్మతో జీవించగలిగేటట్లు సాధనలో సాధ్యమయ్యేటట్లు చేసుకోవటమే కాని మరొకటి కాదు. అదే మోక్షం.*

*ఆత్మానుభూతి, ఎవరి అనుభూతిని వాళ్ళే పొందాలి. ఎవరి నిగ్రహానికి తగిన విధంగా వాళ్లవాల్లకు తగిన అనుభవం సాధనలో చేకూరుతూనే ఉంటుంది. ఆత్మ అనే భగవంతునితో అనుసంధానమై అత్మసాధన కొనసాగిస్తూ జీవించటం నేర్చుకోవాలి. కొద్దిపాటి శ్రద్ధాశక్తులు కలిగిన ప్రతివాళ్ళు దీన్ని అనుభూతి పొందుతారు. ఆ నమ్మకంతో, ఆ పట్టుదలతో, నిరంతర తపనతో, ఆత్మ జ్ఞానంకోసం నిరంతరం ఆత్మ మార్గంలో సాధన చెయ్యాలి.*
*ఆత్మ నెరిగిన వాడే శోకాన్ని అధిగమిస్తాడు.*
*"తరతి శోకం-ఆత్మవిత్ " అని వేదం చెబుతున్నది.*
*"బ్రహ్మ విత్ బ్రహ్మైవ భవతి" బ్రహ్మమును తెలిసినవాడు బ్రహ్మమే అగును అని ఉపనిషత్ వచనం.*
*ఆత్మ 'సత్య జ్ఞానమనంతం' అన్నారు.*
*అనంతమైనది ఆత్మ. ఆనంద స్వరూపమై నది ఆత్మ. మరి మనం అనంతులమా? పరిమితులమా? నిజంగా అనంతులమే. కాని అలా అని తెలియటం లేదు.*
*పరిమితులమని భావిస్తున్నాం. అందుకే అనంతులం కావాలని ప్రయత్నిస్తున్నాం. అనంతులమని తెలియక పోవటమే అజ్ఞానం. అది తెలియటమే జ్ఞానం.*
*జ్ఞానంతో అజ్ఞానం తొలగుతుంది. అజ్ఞానం తొలగితే ఆత్మానుభూతి. నేను ఆత్మననే అనుభూతి*.
*నేను సత్-చిత్-అనంత-ఆనంద స్వరూప ఆత్మను అని తెలిస్తే -*
*ఆ అనుభవంలో నిరంతరం నిలిస్తే ఇక ఈ శరీరమనోబుద్ధుల ద్వారా కలిగే అలజడులు, ఆందోళనలు, సుఖదు:ఖాలు అన్నీ ఇక నావి కావు*.
*వీటి నుండి విడుదల పొందుతాను. *అదే మోక్షం*ఈ మోక్షం - 'నేను ఆత్మను' అని తెలియటం వల్లనే - జ్ఞానం వల్లనే కలుగుతుంది.*
*నేను ఆత్మనే అయి ఉన్నాను. నేను ఆత్మ కన్నావేరు కానేకాదు. మరి *ఆత్మనైన నేను ఆత్మను అని ఎందుకు మరచి పోతున్నాను?*
*ఆటపాటల్లో పడి తిండి తిప్పలు మరచి పోయినట్లు, ఏ అరుణాచలమో యాత్రకు వెళ్లి ఇంటిని మర్చిపోయినట్లు, స్వప్న ప్రపంచలో విహరిస్తూ జాగ్రత్ లోని మన స్వరూపాన్ని మర్చిపోయినట్లు-*
*ఈ శరీర మనోబుద్ధులు కల్పించే ప్రపంచంలో (నాటకంలో) విహరిస్తూ నన్ను నేను మర్చి పోతున్నాను. ఆత్మనని మర్చిపోతున్నాను*.
*అందుకే ఈ ప్రపంచం అసత్యమని, అనిత్యమని, మిధ్యయని మళ్ళీ మళ్ళీ తలుస్తూ అందులో ఇరుక్కున్న బుద్ధిని వెలుపలకు లాగి సాధనలతో శుద్ధి చేయాలి.కనుక *సాధనలనన్నీ బుద్ధిని శుద్ధి చేయటానికే*. *ఆత్మను ప్రత్యేకంగా అందుకోనక్కరలేదు. ఎందుకంటే అది నేనే గనుక. అది లేనిది కాదు గనుక ప్రత్యేకంగా దాన్ని పొందే పనిలేదు. నేను ఆత్మనని తెలుసుకుంటే చాలు. అలా తెలుసుకోవటా న్నే జ్ఞానం అన్నారు*.
*అట్టి జ్ఞానాన్ని పొందటానికి ఏకైక మార్గం గురుబోధను ప్రశాంతంగా వినటమే. ప్రశాంతంగా విని, మననం చేసుకొని, విచారణలో నిలిస్తే ఆత్మ తానేనని తెలుస్తుంది. ఆత్మగానే ఉండిపోతాం.*
*ఆత్మ నేనే గనుక దానిని కొత్తగా పొందలేను. ఆత్మ అనంతం గనుక ఈ కంటితో చూడలేను. కంటితో చూడాలంటే ఆత్మ దృశ్యం కావాలి. దృశ్యమైతే పరిమితమవు తుంది. పరిమితమైతే నశిస్తుంది. నశించేది ఆత్మ కావటానికి వీలులేదు. ఎందుకంటే ఆత్మ వికారాలు లేనిది. చావు పుట్టుకలు లేనిది. శాశ్వతమైనది. కనుక ఆత్మను దర్శించటం అంటే కంటితో చూడటం కాదు. ఆత్మను నేను అని "అహంబ్రహ్మస్మి "గా  తెలుసుకునే జ్ఞానమే ఆత్మ జ్ఞానం.*

వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో

Related Posts

0 comments on "శ్రీ రామదూత...."

Leave A Comment